సీఎంగా తొలి సంతకం.. రూ.2 లక్షల వరకు రుణ మాఫీ

Update: 2018-12-17 12:10 GMT

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడో లేదో అప్పుుడే రైతు సంక్షేమమే ధ్యేయంగా కమల్‌నాథ్ కంకణం కట్టుకున్నాడు. ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కలల్ నాథ్. అసెంబ్లీ ఎన్నికల భాగంగా ఇచ్చిన హామీలో ఇదోక్కటి అందుకే రైతుకు రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేయనున్నారు. కాగా తొమ్మిదిసార్లు లోకసభ ఏంపీగా సేవలందించిన మధ్యప్రదేశ్ సీఎంగా గత వారం రాహుల్‌గాంధీ నియమించిన సంగతి తెలిసిందే. కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 41 లక్షల మంది రైతులపై రూ.56377 కోట్ల రుణ భారం ఉంది. దింతో సిఎం కమల్ నాథ్ అధికారులతో సమావేశమై రైతు రుణమాఫీపై కమల్‌నాథ్ సంతకం చేశారు.
 

Similar News