Union Budget 2026 Live Updates: క్యాపెక్స్‌ను రూ.12.2 లక్షల కోట్లకు పెంచనున్న ఆర్థిక మంత్రి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాపిటల్ ఎక్స్పెండిచర్ (CAPEX) ను రూ. 12.2 లక్షల కోట్లకు పెంచడానికి ప్రతిపాదించారు.
మౌలిక సదుపాయాల వ్యయానికి CAPEX కేటాయింపును కొనసాగిస్తూ, రుణదాతలకు క్రెడిట్ గ్యారంటీ కోసం మౌలిక సదుపాయాల రిస్క్ గ్యారంటీ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కొత్త సరుకు రవాణా కారిడార్‌లను ఏర్పాటుచేయాలని, ప్రత్యేక REITలను ఏర్పాటు చేసి CPSE ఆస్తులను రీసైకిల్ చేయాలని ప్రతిపాదించారు.
ఒడిశాలో ఒక ప్రాజెక్ట్‌తో ప్రారంభించి, మొత్తం 20 కొత్త జలమార్గాలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రజా మూలధన వ్యయం 2014-15లో రూ. 2 లక్షల కోట్ల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 11.2 లక్షల కోట్లకు పెరిగింది.
వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఊపును కొనసాగించడానికి CAPEX ను రూ. 12.2 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి చెప్పారు.
Update: 2026-02-01 06:00 GMT