అమరావతి ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక... ... Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎన్నికల సంఘానికి నిధుల విడుదలపై ప్రభుత్వం సహకరించడంలేదని నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వెల్లడించిన హైకోర్టు

ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించడంలేదన్న హైకోర్టు

ఈసీ ఇచ్చిన వినతులపై ప్రభుత్వం స్పందించకుండా బాధ్యతారాహి త్యంగా వ్యవహరిస్తోందన్న హైకోర్టు

తాము తొలగించిన వ్యక్తి తిరిగి ఈసీగా రావటంతో ప్రభుత్వం నాన్ కో ఆపరేటింగ్ గా వ్యవహరిస్తోందన్న న్యాయ స్థానం

ఇది సరికాదన్న హైకోర్టు

ప్రభుత్వాలు మారుతాయి తప్ప రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఉంటాయన్న హైకోర్టు

రాజ్యాంగ బద్ధ సంస్థలను కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందన్న హైకోర్టు

ఎన్నికల సంఘం 3 రోజుల్లోగా ప్రభుత్వానికి సవివర వినతి పత్రం సమర్పించాలని ఆదేశం

ప్రభుత్వం దీన్ని పరిశీలించి ప్రభుత్వం ఏం చేసిందో నివేదిక రూపంలో 15 రోజుల్లోగా హైకోర్టుకి సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం

మాజీ జస్టిస్ కనగరాజ్ ఫీజు చెల్లింపుల విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

కనగరాజ్ తన పదవికి సంబంధించి అద్వకేట్ ను నియమించుకుంటే ఆయనే న్యాయవాదికి సొంత చెల్లింపులు చేసుకోవాలన్న హైకోర్టు

కనగరాజ్ ఇంటి కోసం 20 లక్షలు, ఫర్నిచర్ కోసం కేటాయించిన 15 లక్షలు ఇవ్వాలా వద్దా అనేది ఈసీ మరోసారి పరిశీలించాలన్న హైకోర్టు

కనగరాజ్ న్యాయవాది కోసం పెట్టిన ఖర్చు వివరాలు ప్రజలకు తెలియాలని, ఇదంతా ప్రజలకు చెందిన సొమ్మన్న హైకోర్టు

Update: 2020-11-03 07:25 GMT

Linked news