Rs 2000 Notes: క్లీన్ నోట్ పాలసీ అంటే ఏమిటి.. రూ. 2 వేల నోటును ఎలా మార్చుకోవాలి?!
Rs. 2000 Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్లను ఉపసంహరించుకొని నల్లధనం బాబులకు షాక్ ఇచ్చింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 నోటును విత్ డ్రా చేసినట్లు తెలిపింది.
Rs. 2000 Note: రూ.2వేల నోటును ఎలా మార్చుకోవాలి?
Rs. 2000 Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్లను ఉపసంహరించుకొని నల్లధనం బాబులకు షాక్ ఇచ్చింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 నోటును విత్ డ్రా చేసినట్లు తెలిపింది. మరి, క్లీన్ నోట్ పాలసీ అంటే ఏంటి..రూ.2 వేల నోటును ఎలా మార్చుకోవాలి..మార్చుకునేందుకు ఉన్న పరిమితులు ఏంటి..
రూ.2000 నోటును ఉపసంహరిస్తూ ఆర్ బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. క్లీన్ నోట్ పాలసీ లో భాగంగా రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తున్నామని ఆర్ బీఐ ప్రకటించింది.
క్లీన్ నోట్ పాలసీ అంటే..
ప్రజలకు నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరించే విధానమే క్లీన్ నోట్ పాలసీ. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఎదురైన ఆర్థిక అవసరాలను వేగంగా అందిపుచ్చుకోవడానికి రూ.2000 నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇతర నోట్లు తగినంత సంఖ్యలో అందుబాటులోకి రావడంతో రూ. 2000 నోట్ల జారీ లక్ష్యం పూర్తయింది. 2016లో రూ.2000 నోటు చలామణిలోకి రాగా 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఇక వీటి జీవిత కాలం 4 నుంచి 5 సంవత్సరాలుగా అంచనా వేసింది. జీవితకాలం పూర్తవ్వడంతో పాటు ఆర్థిక అవసరాల లక్ష్యం కూడా నెరవేరడంతో రూ.2000 నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంది.
రూ.2000 నోటను ఎలా మార్చుకోవాలి
తమ ఖాతా ఉన్న బ్యాంక్ లో రూ.2వేల నోట్లు ఎన్ని అయినాసరే డిపాజిట్ చేసుకోవచ్చు. నోట్ల సంఖ్య పై ఎలాంటి పరిమితి లేదు. డిపాజిట్ చేసుకోవడం కాకుండా నోట్లు మాత్రమే మార్చుకోవాలని అనుకునే వారు దగ్గర్లోని ఏ బ్యాంకు బ్రాంచికైనా వెళ్లి రూ.2వేల నోట్లు ఇచ్చి చిల్లర తీసుకోవచ్చు. అయితే అలా మార్చుకోవడానికి ఆర్బీఐ పరిమితి విధించింది. ఒక వ్యక్తి ఒక ట్రాన్సాక్షన్ లో రూ. 20వేల వరకు అంటే పది పెద్ద నోట్లను మాత్రమే మార్చుకోవచ్చని చెప్పింది.
బ్యాంకులు లేని చోట్ల బ్యాంకింగ్ సేవలను అందించే సంస్థలను సంప్రదించి రూ.2000 నోట్లను మార్చుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. అయితే ఒక్క రోజులో 2 నోట్లను మాత్రమే మార్చుకోవాలంటూ పరిమితులు విధించింది. బ్యాంకుల్లో కానీ బ్యాంకింగేతర సంస్థల్లో కానీ రూ.2వేల నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.