Sovereign Gold Bond : బంగారం కంటే ఎక్కు వ లాభం.. చరిత్ర సృష్టించిన SGB

Sovereign Gold Bond: ఈ మధ్య కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. జూలై 2025లో మాత్రమే బంగారం దాదాపు 2% లాభాన్ని ఇచ్చింది. కానీ, ఈ మధ్యలోనే సావరీన్ గోల్డ్ బాండ్ ఏకంగా 99.67శాతం లాభంతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

Update: 2025-07-13 05:31 GMT

Sovereign Gold Bond : బంగారం కంటే ఎక్కు వ లాభం.. చరిత్ర సృష్టించిన SGB

Sovereign Gold Bond: ఈ మధ్య కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. జూలై 2025లో మాత్రమే బంగారం దాదాపు 2% లాభాన్ని ఇచ్చింది. కానీ, ఈ మధ్యలోనే సావరీన్ గోల్డ్ బాండ్ ఏకంగా 99.67శాతం లాభంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SGB 2020-21 సిరీస్-IV ముందుగానే విత్‌డ్రా చేసుకునే ధరను ప్రకటించింది. ఈ విత్‌డ్రా తేదీ జూలై 14, 2025. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 11, 2025 న విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం..SGB ను విత్‌డ్రా చేసుకునే ధరను 999 స్వచ్ఛత గల బంగారం జులై 9, 10, 11 సగటు ముగింపు ధర ఆధారంగా నిర్ణయించారు. ఈ ధరను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ రోజువారీగా ప్రకటిస్తుంది. ప్రస్తుతానికి, SGB 2020-21 సిరీస్-IV కోసం ఈ ధరను ఒక యూనిట్‌కు రూ.9,688 గా నిర్ణయించారు.

SGB 2020-21 సిరీస్-IV ను జూలై 2020 లో ఒక గ్రాము రూ.4,852 చొప్పున విడుదల చేశారు. ఇప్పుడు ముందుగానే విత్‌డ్రా చేసుకునే ధర రూ.9,688 ఉండటంతో, ప్రతి యూనిట్‌పై రూ.4,836 లాభం వస్తుంది. ఇందులో వడ్డీ కలపలేదు. శాతం పరంగా చెప్పాలంటే, ఇది దాదాపు 99.67% లాభం.

లాభం ఎలా లెక్కిస్తారంటే : [(9,688 – 4,852) / 4,852] × 100 = 99.67%.

SGB లో పెట్టుబడి పెట్టే వారికి మొదట పెట్టిన పెట్టుబడిపై సంవత్సరానికి 2.50% స్థిర వడ్డీ కూడా లభిస్తుంది. ఈ వడ్డీ ప్రతి ఆరు నెలలకొకసారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. చివరి వడ్డీ, అసలు మొత్తంతో పాటు మెచ్యూరిటీ సమయంలో వస్తుంది. SGB బంగారం ధరల పెరుగుదల, 2.50% వడ్డీ, ప్రభుత్వ భద్రత, మెచ్యూరిటీపై పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలను అందిస్తుంది. పెట్టుబడిదారులకు ఇది చాలా సురక్షితమైన మార్గం.

సావరీన్ గోల్డ్ బాండ్ అంటే ఏమిటి?

SGB లు అంటే భారత ప్రభుత్వం తరపున RBI విడుదల చేసే ప్రభుత్వ సెక్యూరిటీలు. వీటి విలువ బంగారు గ్రాముల్లో లెక్కిస్తారు. ఇది నిజమైన బంగారం కొని ఇంట్లో పెట్టుకోవడానికి ఒక మంచి ప్రత్యామ్నాయం. పెట్టుబడిదారులు డబ్బు రూపంలో విలువ చెల్లిస్తారు. మెచ్యూరిటీ అయినప్పుడు కూడా డబ్బు రూపంలోనే తిరిగి పొందుతారు. దీని మెచ్యూరిటీ కాలం 8 సంవత్సరాలు, కానీ ఐదవ సంవత్సరం తర్వాత ముందుగానే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News