RBI: రూ.1000 నోట్లు మళ్లీ వస్తున్నాయా.. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే?
RBI: రూ.2000 నోటు ఉపసంహరణ నేపథ్యంలో రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెడతారనే ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ రూ.1000 నోటు ప్రవేశం పై వివరణ ఇచ్చారు.
RBI: రూ.1000 నోట్లు మళ్లీ వస్తున్నాయా..ఆర్ బీఐ గవర్నర్ ఏమన్నారంటే?
RBI: అవినీతిపై పోరాటం, నల్లధనం సమస్యలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ లో రూ.500, రూ.1000 రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటి స్థానంలో రూ.2000 నోటుతో పాటు కొత్త రూ.500 నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అయితే తాజాగా రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అనుకున్న లక్ష్యం నెరవేరడంతో క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 నోటును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రూ.2వేల నోటు స్థానంలో మళ్లీ రూ.1000 నోటు తెస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్లియర్ కట్ సమాధానం చెప్పారు.
రూ.1000 నోటును మళ్లీ ప్రవేశ పెట్టే ఆలోచన లేదని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. రూ.2వేల నోట్లను విత్ డ్రా చేసిన నేపథ్యంలో ఆ ప్రభావాన్ని తట్టుకునేందుకు రూ.1000 నోటును ప్రవేశపెడతారా అని అడగగా...అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని..రూ.1000 నోటును తీసుకొచ్చే ఆలోచన లేదని స్పష్టీకరించారు. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న కరెన్సీలో కేవలం 10.8 శాతం మాత్రమే రూ.2వేల నోట్లు ఉన్నందున..వాటిని విత్ డ్రా చేయడం వల్ల ఎకానమీపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ గవర్నర్ తేల్చి చెప్పారు.