ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు ఆ లైట్‌ వెలుగుతుందా.. ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త..!

ATM Money Withdraw: ప్రతి ఒక్కరూ ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేస్తారు. కానీ కొన్నిసార్లు మీరు చేసే చిన్న పొరపాటు వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది.

Update: 2022-03-07 15:09 GMT

ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు ఆ లైట్‌ వెలుగుతుందా.. ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త..!

ATM Money Withdraw: ప్రతి ఒక్కరూ ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేస్తారు. కానీ కొన్నిసార్లు మీరు చేసే చిన్న పొరపాటు వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలు, ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం సురక్షితం కాదు. వాస్తవానికి గత కొన్ని రోజులుగా ATM మోసానికి సంబంధించిన కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి మీరు ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేసినప్పుడల్లా అప్రమత్తంగా ఉండండి. మీరు ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ATM ఉపయోగించిన తర్వాత మీరు దానిని జాగ్రత్తగా తనిఖీ చేయాలి. ATM లో అతిపెద్ద ప్రమాదం కార్డ్ క్లోనింగ్. ఇక్కడ మీ వివరాలు సులభంగా దొంగిలిస్తారు.

ఈ రోజుల్లో హ్యాకర్లు చాలా తెలివిగా మారిపోయారు. ఏటీఎం మెషీన్‌లో కార్డ్ ఇన్‌సర్ట్ చేసి ఏ కస్టమర్ డేటానైనా దొంగిలిస్తున్నారు. ఎలక్ట్రిక్ పరికరం సాయంతో డేటా దొంగిలిస్తున్నారు. దీని తర్వాత కూడా మీ డెబిట్ కార్డ్‌ పూర్తి యాక్సెస్‌ పొందడానికి హ్యాకర్‌కి మీ పిన్ నంబర్ తెలిసి ఉండాలి. హ్యాకర్లు దీనికి కూడా ఒక పద్ధతిని కలిగి ఉన్నారు. కెమెరాతో పిన్ నంబర్‌ను ట్రాక్ చేస్తున్నారు. అందుకే ఏటీఎంలో పిన్ నంబర్‌ను ఎంటర్ చేసేటప్పుడు మరొక చేత్తో కవర్ చేయాలి. తద్వారా అది CCTV కెమెరాలో కనిపించదు.

ఇది కాకుండా మీరు ATMకి వెళ్లినప్పుడు మెషీన్ కార్డ్ స్లాట్‌ను తనిఖీ చేయండి. ATM కార్డ్ స్లాట్‌లో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందని భావిస్తే లేదా స్లాట్ వదులుగా ఉన్నట్లయితే దానిని ఉపయోగించవద్దు. కార్డ్ స్లాట్‌లో కార్డ్‌ను చొప్పించేటప్పుడు వెలుగుతున్న గ్రీన్‌ లైట్‌పై ఓ కన్నేసి ఉంచండి. ఇక్కడ స్లాట్‌లో గ్రీన్ లైట్ ఆన్ చేసి ఉంటే మీ ATM సురక్షితంగా ఉందని అర్థం. కానీ అందులో ఎరుపు లేదా మరేదైనా లైట్ వస్తే అప్పుడు ATM ఉపయోగించవద్దు.

Tags:    

Similar News