Stock Market: వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market: 100.26 పాయింట్ల లాభంతో 65,880.52 వద్ద ముగిసిన సెన్సెక్స్‌

Update: 2023-09-06 13:57 GMT

Stock Market: వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాలతో ముగిశాయి.. రోజంతా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న మార్కెట్లు ఆఖర్లో కొనుగోళ్ల అండతో లాభాల్లోకి ఎగబాకాయి. సెన్సెక్స్‌ 100.26 పాయింట్ల లాభంతో 65 వేల 880.52 దగ్గర స్థిరపడగా.. నిఫ్టీ 36.15 పాయింట్లు లాభపడి 19 వేల 611.05 దగ్గర ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటన్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

Tags:    

Similar News