Stock Market: స్టాక్ మార్కెట్ జోరుకు బ్రేక్
Stock Market: స్టాక్ మార్కెట్లలో వరుసగా ఎనిమిది సెషన్ ల లాభాల జోరుకు ఇవాళ బ్రేక్ పడింది.
Stock Market: స్టాక్ మార్కెట్లలో వరుసగా ఎనిమిది సెషన్ ల లాభాల జోరుకు ఇవాళ బ్రేక్ పడింది. ఐటీ, ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాల వెల్లువతో కీలక సూచీలు పతనమయ్యాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నడుమ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.
భారత్ _అమెరికా వాణిజ్య చర్చలపై పురోగతి సైతం మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది. మొత్తంమీద సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 81,785 పాయింట్ల వద్ద ముగియగా, 44 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 25,069 పాయింట్ల వద్ద క్లోజయింది.