Loan Guarantor Rules: తెలిసినవారి లోన్ కోసం షూరిటీ సంతకం పెట్టారా.. ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
Loan Guarantor Rules: మన దగ్గరివారు లేదా బంధువులు లోన్ తీసుకునేటప్పుడు షూరిటీ సంతకం కోసం అడుగుతుంటారు. కొన్నిసార్లు మొహమాటానికి పోయి షూరిటీ సంతకం పెట్టి ఇబ్బందుల పాలవుతారు.
Loan Guarantor Rules: తెలిసినవారి లోన్ కోసం షూరిటీ సంతకం పెట్టారా.. ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
Loan Guarantor Rules: మన దగ్గరివారు లేదా బంధువులు లోన్ తీసుకునేటప్పుడు షూరిటీ సంతకం కోసం అడుగుతుంటారు. కొన్నిసార్లు మొహమాటానికి పోయి షూరిటీ సంతకం పెట్టి ఇబ్బందుల పాలవుతారు. ఈ పరిస్థితి చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. వాస్తవానికి ఎవరైనా లోన్ తీసుకునేటప్పుడు అతడికి హామీగా లోన్ గ్యారెంటర్ అవసరం. అప్పుడే ఆ వ్యక్తి లోన్ పొందగలుగుతాడు. లోన్ తీసుకోవడం చాలా కఠినమైన ప్రక్రియ. ఇందులో అనేక లెక్కలు దాగి ఉంటాయి. లోన్ తీసుకున్న వ్యక్తి సరిగ్గా చెల్లించకపోతే ఆ ఎఫెక్ట్ షూరిటీ సంతకం పెట్టినవారిపై పడుతుంది. దీని నియమ నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
మీరు ఎవరికైనా లోన్ గ్యారెంటర్‌గా మారితే పెద్ద ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇండియన్ కాంట్రాక్ట్ చట్టంలోని 128 ప్రకారం లోన్ తీసుకునే వ్యక్తి ఒక విధంగా గ్యారంటర్‌తో పాటు సహ దరఖాస్తుదారు కూడా. అంటే లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ చెల్లించకపోతే ఆ బాధ్యత షూరిటీ సంతకం పెట్టినవారిపై పడుతుంది. మిగిలిన డబ్బు తిరిగి చెల్లించడం హామీదారుడి బాధ్యత అవుతుంది. అందుకే తెలిసిన వ్యక్తికి, లోన్ తిరిగి చెల్లించే శక్తి ఉన్న వ్యక్తికి మాత్రమే షూరిటీ సంతకం పెట్టాలి.
మీరు స్నేహితుడు లేదా బంధువుల లోన్‌కు గ్యారెంటర్‌గా మారితే వారు తమ వాయిదాలను సకాలంలో చెల్లిస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. వారిని గమనిస్తూ ఉండాలి. ఆ వ్యక్తి లోన్ తిరిగి చెల్లించకపోతే అది గ్యారెంటర్ సిబిల్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. భవిష్యత్‌లో అతడికి రుణం పొందే అవకాశాలు తగ్గుతాయి. భారతీయ కాంట్రాక్ట్ చట్టం ప్రకారం లోన్ తీసుకునే వ్యక్తిపై కేసు నమోదు చేసి ఈ పరిస్థితి నుంచి తనను తాను రక్షించుకునే హక్కు గ్యారెంటర్‌కు ఉంటుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు.