Electric Cars: దేశంలో ఎలక్ట్రిక్‌ కార్లపై పన్ను మినహాయింపు.. ఎంత మొత్తంలో అంటే..?

Update: 2021-12-21 02:30 GMT

దేశంలో ఎలక్ట్రిక్‌ కార్లపై పన్ను మినహాయింపు.. ఎంత మొత్తంలో అంటే..?

Electric Cars: సంప్రదాయ ఇంధన వనరుల వల్ల పొల్యూషన్‌ విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల మానవ మనుగడకే ముప్పు పొంచి ఉంది. అంతేకాదు పెట్రోల్, డీజిల్‌ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుడు ప్రత్యామ్నాయ మార్గాల గురించి అన్వేషిస్తున్నాడు. వారికి ఎలక్ట్రిక్‌ వాహనాలు ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తున్నాయి. అందుకే ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై మొగ్గు చూపుతున్నాడు. రాబోయే తరం మొత్తం ఎలక్ట్రిక్‌ వాహనాలు సందడి చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఈ వాహనాలకు మద్దతునిస్తుంది. లబ్దిదారులకు పన్ను మినహాయింపునిస్తుంది.

వాస్తవానికి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించే కార్లు భారతీయ పన్ను చట్టాల ప్రకారం విలాసవంతమైన ఉత్పత్తిగా పరిగణిస్తారు. అందుకే జీతం పొందే ఉద్యోగులు వీటి రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాలను పొందరు. కానీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం లబ్దిదారులకు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లకు కొరత లేదు. రాబోయే సంవత్సరంలో కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి అన్ని కంపెనీలు సిద్దంగా ఉన్నాయి.

ఎలక్ట్రిక్‌ కొనుగోలుదారులకు EV లోన్‌ను చెల్లించేటప్పుడు సెక్షన్ 80EEB కింద రూ. 1,50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పన్ను మినహాయింపు ఫోర్ వీలర్. టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు కూడా వర్తిస్తుంది. రుణంపై EVని కొనుగోలు చేయడానికి ఎంచుకున్న వారు సెక్షన్ 80EEB కింద రుణం మొత్తంపై రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపుకు అర్హులు. అయితే సాధారణ వ్యక్తులు మాత్రమే ఈ మినహాయింపును పొందగలరు. పన్ను చెల్లింపుదారులు ఈ మినహాయింపుకు అర్హులు కాదు. మీరు HUF, AOP, భాగస్వామ్య సంస్థ, కంపెనీ లేదా మరేదైనా పన్ను చెల్లింపుదారు అయితే ఈ నిబంధన కింద వారు ఎటువంటి ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయలేరు.

Tags:    

Similar News