Animals Insurance: ఇంట్లో జంతువులను పెంచుకుంటున్నారా.. ఈ ఖర్చు నుంచి బయటపడండి..!

Animals Insurance: మనుషుల మాదిరి ఇప్పుడు జంతువులకు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవ చ్చు. ఆధునిక కాలంలో పెంపుడు జంతువులను పెంచుకునే అలవాటు బాగా పెరిగింది.

Update: 2024-04-14 11:30 GMT

Animals Insurance: ఇంట్లో జంతువులను పెంచుకుంటున్నారా.. ఈ ఖర్చు నుంచి బయటపడండి..!

Animals Insurance: మనుషుల మాదిరి ఇప్పుడు జంతువులకు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవ చ్చు. ఆధునిక కాలంలో పెంపుడు జంతువులను పెంచుకునే అలవాటు బాగా పెరిగింది. అంతే కాదు కొంతమంది దీనిని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. ఇంకొందరు అత్యుత్సాహంగా వాటిని కుటుంబ సభ్యులుగా ఫీలవుతున్నారు. ఈ పెంపుడు జంతువుల ఆరోగ్యం, ఆహారం, ఇతర అవసరాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పడుతున్నారు. అయితే అకస్మాత్తుగా పెంపుడు జంతువుల ఆరోగ్యం క్షీణించి చికిత్స కోసం చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే దీని నుంచి బయటపడడానికి కొన్ని కంపెనీలు వీటికి కూడా బీమా సౌకర్యాలను కల్పించాయి.

వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మార్కెట్‌లో అనేక బీమా పాలసీలు ఉన్నాయి. వీటిలో 5 పెంపుడు జంతువులకు రక్షణ పొందుతారు. HDFC ERGO పావ్స్ & క్లాజ్ కొత్త బీమా పరిష్కారాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో పెంపుడు జంతువులు ఏడేళ్ల వరకు రక్షణ పొందుతాయి. ఈ పాలసీ 6 నెలల నుంచి 5 ఏళ్ల పెంపుడు జంతువులకు వర్తిస్తుంది. మీకు ఒకటి కంటే ఎక్కువ కుక్కలు లేదా పిల్లులు ఉన్నా ఈ పాలసీ ప్రయోజనాలను పొందవచ్చు. మీరు మీ పెంపుడు జంతువుకు బీమా చేసినట్లయితే దాని OPD ఖర్చులు బీమా కంపెనీచే కవర్ అవుతాయి. ఇది కాకుండా మీరు నాన్-హెల్త్ కవర్‌ను కూడా పొందవచ్చు. ఇందులో థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ ఉంటుంది. పెంపుడు జంతువు వేరొకరికి హాని కలిగించినప్పటికీ వారికి బీమా కంపెనీ ఆర్థికంగా పరిహారం చెల్లిస్తుంది.

ఎంత డబ్బు ఖర్చవుతుంది

పెంపుడు జంతువుల బీమాలో నెలవారీ ఖర్చుల ప్రకారం మీరు అనేక ఆప్షన్స్‌ పొందుతారు. పెంపుడు జంతువుల బీమా మొత్తం పెంపుడు జంతువు జాతి, రకం, వయస్సుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రజలు రూ. 40,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు బీమాను పొందుతారు. వీటి బీమా ప్రీమియం ఎక్కువగా ఉండదు. ఉదాహరణకు, రూ.25,000 దీర్ఘకాలిక కవర్ పొందడానికి మీరు కేవలం రూ.1,284 ప్రీమియం చెల్లించాలి. 

Tags:    

Similar News