EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్‌.. కొత్త ఏడాది ఈ సమస్య తొలగిపోయింది..!

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు ఇది శుభవార్తనే చెప్పాలి. ఇప్పుడు తరచుగా ఉద్యోగాలు మారినవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Update: 2024-04-15 08:00 GMT

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్‌.. కొత్త ఏడాది ఈ సమస్య తొలగిపోయింది..!

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు ఇది శుభవార్తనే చెప్పాలి. ఇప్పుడు తరచుగా ఉద్యోగాలు మారినవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కొత్త నిబంధనలను జారీ చేసింది. దీని ప్రకారం.. ఖాతాదారుడు ఉద్యోగం మారినప్పుడు ఆటోమేటిక్‌ అతడి ఖాతా బదిలీ అవుతుంది. ఇందుకోసం ఎలాంటి రెక్వెస్ట్‌ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అమౌంట్‌ బదిలీ అవుతుంది.

చాలా సార్లు EPFO బ్యాలెన్స్ నెలల తరబడి బదిలీ కాదు. ఇప్పుడు ఇక ఏ టెన్షన్‌ ఉండదు. ఉద్యోగాలు మారినప్పుడు మాన్యువల్‌గా పీఎఫ్‌ బదిలీ కోసం అభ్యర్థించాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇంతకుముందు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఉన్నప్పటికీ పీఎఫ్ బదిలీ కోసం ప్రజలు రిక్వెస్ట్‌ను సమర్పించాల్సి ఉండగా ఇప్పుడు ఆ పద్దతిని తీసివేసింది.

ఉద్యోగులు తమ జీతంలో 12 శాతాన్ని ఈపీఎఫ్‌ కి బదిలీ చేయాలి. ఇందులో యజమాని కూడా ఉద్యోగి తరపున సమాన మొత్తాన్ని EPF ఖాతాలో డిపాజిట్ చేయాలి. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది ఒక వ్యక్తికి అనేక విభిన్న యజమానులు జారీ చేసిన బహుళ సంస్థల ఐడీల కేంద్రంగా పనిచేస్తుంది. ఇది చాలా ఈపీఎఫ్‌ ఖాతాలను ఒకే సభ్యునికి లింక్ చేస్తుంది. అలాగే UAN కార్డ్, అప్‌డేట్‌ పాస్‌బుక్, మునుపటి సభ్యుల పీఎఫ్‌ ఐడీ, ప్రస్తుత పీఎఫ్‌ ఐడీతో లింక్ చేయగల సామర్థ్యం, క్రెడిట్‌కు సంబంధించి నెలవారీ SMS నోటిఫికేషన్ల వంటి సేవలను అందిస్తుంది.

Tags:    

Similar News