Hansika Nasanally: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన హన్సిక

Hansika Nasanally: అచ్చ తెలుగమ్మాయి హన్సిక నసనల్లి తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో రెపరెపలాడించారు.

Update: 2024-12-04 13:00 GMT

అచ్చ తెలుగమ్మాయి హన్సిక నసనల్లి తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో రెపరెపలాడించారు. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. ఈ పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూ. టీన్ విజేతగా నిలిచారు. ఇవే కాకుండా హన్సిక గత రెండేళ్లుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు.

అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డుని కూడా ఆమె కైవసం చేసుకున్నారు. క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యాన్ని నేర్చుకుని అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ గత నాలుగు సార్లు విజేతగా నిలిచారు. హన్సిక స్వస్థలం వనపర్తి. తండ్రి శేఖర్. తల్లి ప్రశాంతిని ప్రముఖ భరత నాట్య కళాకారిణి, నటి. కన్నడ, తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురు హన్సిక.



Tags:    

Similar News