Vastu Tips for Money Plant: ఇంట్లో మొదటిసారి మనీ ప్లాంట్ పెడతారా? వాస్తు చిట్కాలు తప్పకుండా పాటించండి

మనీ ప్లాంట్‌ పచ్చదనానికే కాదు, ఇంట్లో శ్రేయస్సు, ధనసంపత్తిని కూడా ఆకర్షిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా తొలిసారి ఇంట్లో మనీ ప్లాంట్‌ నాటుతున్నప్పుడు కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది.

Update: 2025-07-31 13:40 GMT

ఈ మొక్కను ఉంచేందుకు అత్యంత అనుకూలమైన దిశ ఆగ్నేయం (సౌత్‌ఈస్ట్). ఈ దిశకు శుక్రుడు అధిపతి కావడంతో పాటు, గణపతి కూడా ఇక్కడ కొలువై ఉంటాడని నమ్మకం. ఈ దిశలో మనీ ప్లాంట్‌ను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. అదృష్టం, ఆర్థిక అభివృద్ధి స్వయంగా వస్తాయని నిపుణుల అభిప్రాయం.

అయితే ఈశాన్యం (నార్త్‌ఈస్ట్) దిశలో మాత్రం ఈ మొక్కను పెట్టడం మంచిది కాదు. బృహస్పతికి చెందిన ఈ దిశ శుక్రునికి అనుకూలం కాకపోవడంతో, ఇక్కడ మనీ ప్లాంట్ ఉంచితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, సంబంధాలలో విభేదాలు వచ్చే అవకాశముంటుంది.

మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ పైకి పెరిగేలా ఉండాలి. అవి కింద వేలాడేలా వదిలేయకూడదు. తీగలు పైకి పాకేలా మద్దతు ఇవ్వడం అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. అలాగే, ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే, పచ్చగా ఉన్న మొక్కను ఎంచుకోవాలి. ఎండిపోయిన ఆకులు, పసుపు రంగు పట్టిన ఆకు ఉంటే వెంటనే తొలగించాలి. అలాంటి మొక్కలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి.

ఇక మనీ ప్లాంట్‌ను బెడ్‌రూంలో పెట్టకూడదు. ఇది దంపతుల మధ్య ఒడిదుడుకులను కలిగించే అవకాశముంది. అలాగే కిచెన్‌లోనూ ఉంచరాదు. బాత్రూంలలో ఉంచడం వల్ల కూడా సానుకూలత తగ్గుతుంది.

ఇంకొంచెం శ్రద్ధ చూపించాల్సిన విషయం — మనీ ప్లాంట్‌ను ఎవరికి ఇచ్చేయకూడదు. వాస్తు నిపుణుల ప్రకారం, ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న సంపద ఇతరులకు వెళ్తుందనే నమ్మకం ఉంది. అలాగే, మనీ ప్లాంట్‌ను పొడి నేలలో పెట్టకుండా ఎప్పుడూ తడి మట్టి ఉండేలా చూసుకోవాలి.

ఈ అన్ని వాస్తు సూచనలను పాటిస్తే, మనీ ప్లాంట్ కేవలం ఇంటిని శోభాయమానంగా మార్చడమే కాకుండా, అదృష్టం, ధనసంపదను కూడా ఆకర్షించే శక్తిగా మారుతుంది.

Tags:    

Similar News