ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Update: 2019-04-13 01:49 GMT

కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 8 నుండి తొమ్మిదిన్నర గంటల వరకు శేష వాహనసేవ జరగనుంది. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు అలాగే రాత్రి 8 నుండి తొమ్మిదిన్నర గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 14న శ్రీరామనవమి వేడుక జరగనుంది, ఇక 16న హనుమత్సేవ, 17న గరుడసేవ జరగనున్నాయి. 18న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. అనంతరం గజ వాహనసేవ నిర్వహిస్తారు. 19న రథోత్సవం నిర్వహిస్తారు. 21న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 

Similar News