Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త.. ఎండితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు, మొక్కలు ఇంటికి శుభం, సంపదను తీసుకొస్తాయి. అందుకే వాస్తు నిపుణులు వీటిని పెంచమని సూచిస్తారు. కానీ ఈ మొక్కలు ఎండిపోవడం ప్రారంభిస్తే అది అశుభ సూచనగా భావిస్తారు.
Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త.. ఎండితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు, మొక్కలు ఇంటికి శుభం, సంపదను తీసుకొస్తాయి. అందుకే వాస్తు నిపుణులు వీటిని పెంచమని సూచిస్తారు. కానీ ఈ మొక్కలు ఎండిపోవడం ప్రారంభిస్తే అది అశుభ సూచనగా భావిస్తారు. ముఖ్యంగా ఈ మూడు మొక్కలు ఎండిపోతే లక్ష్మీదేవి కరుణ తగ్గి ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
1. తులసి మొక్క
ఇంట్లో తులసి మొక్కను పెంచడం అత్యంత శుభప్రదం. పచ్చగా ఉన్న తులసి ఇంట్లో సానుకూల శక్తిని పెంచి ఆనందం, శ్రేయస్సు అందిస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా కురుస్తాయి. అయితే తులసి మొక్క వాడిపోవడం మొదలైతే ఆర్థిక నష్టాల సూచనగా పరిగణిస్తారు. కాబట్టి దీన్ని ఎప్పుడూ పచ్చగా ఉంచేలా జాగ్రత్త పడాలి.
2. శమీ చెట్టు
శమీ మొక్కను ఇంట్లో పెంచితే శని దోష ప్రభావం తగ్గుతుందని, శివుడి కరుణ లభిస్తుందని నమ్మకం. కానీ ఇది ఎండిపోవడం ప్రారంభిస్తే అశుభ సంకేతంగా భావిస్తారు. వెంటనే ఎండిన మొక్కను తొలగించి కొత్త పచ్చని శమీ మొక్కను నాటాలి.
3. మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని, లక్ష్మీదేవి కరుణ ఉంటుంది అని చెబుతారు. అయితే ఇది ఎండిపోతే డబ్బు కొరత, ఆర్థిక సమస్యలు వస్తాయని భావిస్తారు. కాబట్టి ఎండిపోయిన మొక్కను వెంటనే తొలగించి కొత్త మనీ ప్లాంట్ నాటాలి.
ఇంటి శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం కోసం ఈ మూడు మొక్కలు ఎప్పుడూ పచ్చగా, ఆరోగ్యంగా ఉంచడం ఎంతో అవసరం.