Khairatabad Ganesh: ఒక్క అడుగు విగ్రహంతో మొదలైన మహాగణనాథుడి చరిత్ర.. 71 ఏళ్ల అద్భుత ప్రయాణం

హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది జరిగే గణేశ్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేక స్థానం ఉంది. భక్తులకు ప్రతిసారి వినూత్న రూపంలో దర్శనమిచ్చే ఈ మహాగణపతి, ఈసారి "శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి" అవతారంలో అలరించబోతున్నాడు.

Update: 2025-08-26 16:00 GMT

Khairatabad Ganesh: ఒక్క అడుగు విగ్రహంతో మొదలైన మహాగణనాథుడి చరిత్ర.. 71 ఏళ్ల అద్భుత ప్రయాణం

హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది జరిగే గణేశ్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేక స్థానం ఉంది. భక్తులకు ప్రతిసారి వినూత్న రూపంలో దర్శనమిచ్చే ఈ మహాగణపతి, ఈసారి "శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి" అవతారంలో అలరించబోతున్నాడు. ఈ విగ్రహాన్ని పూర్తిగా మట్టితో తయారు చేశారని, భక్తుల విఘ్నాలు తొలగి విశ్వశాంతి నెలకొనేందుకే ఈ పేరును పెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగమనోత్సవంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, మరాఠా బ్యాండ్‌ వాయిద్యాలు, మహిళల సంప్రదాయ స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఖైరతాబాద్ వినాయకుడి చరిత్ర 71 ఏళ్లకు పైగా ఉంది. 1893లో మహారాష్ట్రలో లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆధ్వర్యంలో సామాజిక ఐక్యత కోసం గణపతి ఉత్సవాలను ప్రారంభించారు. ఆ స్ఫూర్తితో స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కార్పొరేటర్ సింగరి శంకరయ్య 1954లో ఖైరతాబాద్‌లో 1 అడుగు ఎత్తు గల గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఒక్క అడుగు పెంచుతూ విగ్రహాన్ని ప్రతిష్ఠించే సంప్రదాయం కొనసాగుతోంది.

2014లో 60 అడుగుల ఎత్తుతో ఘనంగా షష్టిపూర్తి వేడుకలు జరిగాయి. ఈ ఏడాది 71వ సంవత్సరం కావడంతో 69 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కొన్నాళ్లపాటు ఖైరతాబాద్ గణనాథుడు లడ్డూ నైవేద్యంతో కూడా వార్తల్లో నిలిచాడు. అయితే, తొక్కిసలాట కారణంగా ఆ ఆచారాన్ని నిలిపివేసి ఇప్పుడు గణపతి చేతిలో ప్రతీకాత్మక లడ్డు మాత్రమే ఉంచుతున్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది 55 అడుగుల జంజం, 50 అడుగుల కండువా సమర్పించడం కూడా ఒక ముఖ్య సంప్రదాయం.

Tags:    

Similar News