Indrakeeladri: మొబైల్ నిషేధం.. డ్రెస్ కోడ్ తప్పనిసరి – అమ్మవారి దర్శనానికి తిరుమల తరహా నిబంధనలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించాలంటే ఇకపై డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. మహిళలు చీర లేదా చున్నీతో కూడిన సల్వార్ కమీజ్, పురుషులు సంప్రదాయ దుస్తులైన ధోతీ లేదా పైజామా, చొక్కా ధరించి రావాలని ఆలయ అధికారులు స్పష్టంచేశారు. తిరుమల తరహాలోనే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.

కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన శీనా నాయక్ కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ఇంద్రకీలాద్రిలో మార్పుల పునాది పడింది. ఆలయ పరిసరాల్లో ఆక్రమణలు తొలగించి, పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. ఇకపై అభ్యంతరకర దుస్తులతో వచ్చిన భక్తులను దర్శనానికి అనుమతించరు. అదేవిధంగా మొబైల్ ఫోన్లు ఆలయంలోకి తీసుకురావడానికి నిషేధం విధించారు. ప్రత్యేక కౌంటర్లలో మొబైల్ భద్రపరచి మాత్రమే భక్తులు దర్శనానికి వెళ్లాలి.
తిరుపతి తర్వాత రెండో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఇంద్రకీలాద్రిలో సంప్రదాయ దుస్తులు ధరించే నియమాన్ని భక్తులు కూడా హర్షిస్తున్నారు. రాబోయే తరాలకు మన ఆచారాలు, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు.