God Idols: ఇంట్లో ఉంచకూడని దేవుళ్ల ఫోటోలు ఏవో తెలుసా..?
మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లో దేవుని ఫోటోలు ఉండడం, పూజ చేయడం సాధారణం. కానీ వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కొన్ని దేవుళ్ల ఫోటోలు ఇంట్లో ఉంచడం అనుకూలంగా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
God Idols: ఇంట్లో ఉంచకూడని దేవుళ్ల ఫోటోలు ఏవో తెలుసా..?
మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లో దేవుని ఫోటోలు ఉండడం, పూజ చేయడం సాధారణం. కానీ వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కొన్ని దేవుళ్ల ఫోటోలు ఇంట్లో ఉంచడం అనుకూలంగా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఫోటోలు ఉంచడం వల్ల కుటుంబంలో కలహాలు, ఆర్థిక నష్టాలు, శాంతిభద్రతల లోపాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి అలాంటి దేవుళ్ల ఫోటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.
🔸 ఉగ్ర నరసింహ స్వామి ఫోటో:
ఇంట్లో ఉంచకూడని దేవుళ్ల ఫోటోలలో ఉగ్ర నరసింహుడి ఫోటో ప్రధానమైనది. ఈ ఫోటో ఉంచడం వల్ల ఇంట్లో ఆగ్రహం, కలహాలు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సమరసత లోపించవచ్చు. అయితే లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, ప్రహ్లాద నరసింహ స్వామి ఫోటోలు మాత్రం పూజా గదిలో ఉంచవచ్చు.
🔸 మహాలక్ష్మీ నిల్చున్న ఫోటో:
లక్ష్మీదేవి ఫోటో ఉంచకూడదా అనే సందేహం రావచ్చు. కానీ ఆమె నిలబడి ఉన్న ఫోటోను ఇంట్లో పెట్టకూడదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆ ఇంట్లో సంపద వెలుపలకి వెళ్లిపోతుందని భావిస్తారు. దీన్ని బదులుగా కమలంపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే ధనసంపద పెరుగుతుందని నమ్మకం.
🔸 శ్రీరామ పట్టాభిషేకం ఫోటో:
ఇంట్లో శ్రీరాముని పట్టాభిషేక దృశ్యాన్ని ఉంచడం వల్ల కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయట. సభ్యుల ఆలోచనా ధోరణి మారి, అపజ్ఞానపు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని శాస్త్ర నిపుణుల చెబుతున్నారు.
🔸 నటరాజ స్వామి ఫోటో:
నటరాజ స్వామి నృత్య రూపాన్ని ఇంట్లో ఉంచకూడదట. ఇది ఇంటిలో పేదరికాన్ని తెచ్చిపెడతుందని నమ్మకం ఉంది. అయితే నాట్య కళాశాలల్లో మాత్రం ఇది చాలా శుభఫలితాలను ఇస్తుందట.
🔹 గమనిక:
ఈ సూచనలు వాస్తు, జ్యోతిష్యశాస్త్ర నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఉన్నాయి. శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు. వాటిని నమ్మడం లేదా పాటించడం పూర్తిగా వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.