Ayyappa Deeksha Rules: అయ్యప్ప దీక్ష నియమాలు... 41 రోజుల అయ్యప్ప మాల విశేషాలు
అయ్యప్ప దీక్ష లేదా అయ్యప్ప మాల అనేది అయ్యప్ప స్వామిని భక్తితో పూజించడానికి 41 రోజుల వ్రతం.
Ayyappa Deeksha Rules: అయ్యప్ప దీక్ష నియమాలు... 41 రోజుల అయ్యప్ప మాల విశేషాలు
అయ్యప్ప దీక్ష లేదా అయ్యప్ప మాల అనేది అయ్యప్ప స్వామిని భక్తితో పూజించడానికి 41 రోజుల వ్రతం. భక్తుల నమ్మకం ప్రకారం, దీక్ష చేయడం వల్ల ఆధ్యాత్మిక ఆనందం, మానసిక శాంతి లభిస్తుంది. సాధారణంగా కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి వరకు భక్తులు దీక్ష తీసుకుంటారు.
అయ్యప్ప మాల నియమాలు
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. భక్తులు దేశం నలుమూలల నుంచి ఆలయ దర్శనానికి వస్తారు. అయితే 41 రోజుల దీక్ష తీసుకుని మాలధారణ చేయడం తప్పనిసరిగా ఉంటుంది. ఈ కాలంలో భక్తులు నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు.
సాత్విక జీవనం & బ్రహ్మచర్యం
దీక్ష సమయంలో తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి.
అబద్ధాలు చెప్పకూడదు, ఇతరులను దూషించకూడదు.
పరుష పదాలను ఉపయోగించకూడదు.
ఇతరులను మోసం చేయడం మహాపాపం.
నిత్యం “శరణం అయ్యప్ప” అని స్వామి చింతనలో ఉండాలి.
వస్త్ర & ఆహార నియమాలు
41 రోజుల పాటు మాంసాహారం, మద్యం, ఇతర వ్యసనాలు పూర్తిగా మానుకోవాలి.
సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.
ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు తప్పించాలి.
తక్కువ ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవాలి.
రోజుకు కనీసం ఐదుగురు అయ్యప్ప స్వామికి భిక్ష ఇవ్వాలి.
నలుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలి.
ప్రతి రోజు ఉతికిన బట్టలు ధరిస్తూ ఉండాలి.
దినచర్య
ప్రతిరోజూ ఉదయం నిద్రలేచి చిన్ని స్నానం చేయాలి.
ఉదయం, సాయంత్రం భక్తితో పూజ, కర్పూర హారతి, భజన చేయాలి.
41 రోజులంతా నేలపై లేదా దుప్పటి మీద పడుకోవాలి; పాదరక్షలు ధరించరాదు.
దీక్ష సమయంలో క్షవరం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు.
మాల ధారణలో జాగ్రత్తలు
మాలను గురుస్వామి లేదా తల్లిదండ్రుల ద్వారా ధరించాలి.
రుద్రాక్ష, తులసి మాలలు ఎప్పుడూ మెడ నుండి తీయకూడదు.
స్నానం, పాదపూజ సమయంలో మాల నేలకు తాకనివ్వకూడదు.
మాల ధరించిన తర్వాత ప్రతి ఒక్కరినీ స్వామి అని పిలవాలి.
గురుస్వామి, తల్లిదండ్రులు, పెద్దలకు పాదాభివందనం చేయాలి.
అశుభ కార్యక్రమాల్లో పాల్గొనరాదు.
రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువులు మరణిస్తే మాలను విసర్జించాలి.
నిత్యం తలపై విభూధి, చందనం, కుంకుమ పెట్టాలి.
మూల మంత్రం “శరణం అయ్యప్ప” జపం చేయాలి.
గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల ప్రకారం సూచనలు ఇచ్చాం; వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. విశ్వాస స్థాయి వ్యక్తిగతం. సమయం తెలుగు ఈ నియమాల నిజత్వాన్ని ధృవీకరించదు.