నల్లని మేఘం వెనక...

Update: 2019-02-18 10:23 GMT

వర్షం వచ్చె ముందు ఆకాశంలో చూస్తే మేఘాలు రావటం, గాలిలో ఒకరకమైన వాసన రావటం సహజం, అయితే వర్షం వచ్చేముందు మేఘాలు నల్లగా కూడా ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? వర్షం వచ్చే ముందు నల్లని మెఘాలు కమ్ముకుంటాయి . అంతకు ముందు అవి నీలం , తెలుపు రంగుల్లో ఉంతాయి .ఆ నల్లని మేఘాలను శాస్త్రపరిభాషలో " కుమ్యులో నింబస్ " మేఘాలలు అంటారు . ఆ మేఘాలలొ దట్టంగా పేరుకున్న నీటి బిందువులు , మంచు అందుకు కారణము. ఆ దట్టమైన పొరవలన ఆ మేఘాలలో నుండి కాంతి కి్రణాలు ప్రయాణం చేయలేవు . ఫలితంగా మనకు నల్లగా కనిపిస్తాయి . ధూళిరేణువులు , కాలుష్యకారకాల వల్ల కుడా నల్లరంగు వస్తుందట. శ్రీ.కో.

Similar News