పొద్దుతిరుగుడు పువ్వు, సూర్యుడిని చూస్తూ బతికేస్తుందా!

పొద్దుతిరుగుడు పువ్వుని మీరు గమనిస్తే అది ఎప్పుడూ సూర్యునివైపే తిరిగి వుంటుంది...అలా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా?

Update: 2019-02-25 06:31 GMT

పొద్దుతిరుగుడు పువ్వుని మీరు గమనిస్తే అది ఎప్పుడూ సూర్యునివైపే తిరిగి వుంటుంది...అలా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? సూర్యుడు తూర్పున ఉదయించింది మొదలు సాయంత్రం పడమరలో అస్తమించే వరకు అది సూర్యుని వంకే చూస్తున్నట్లుగా తిరుగుతుంది ఎందుకంటే ... ఈ పువ్వు ఇలా తిరగడానికి కారణం ఈ మొక్కలో ఉండే ఫొటోట్రాపిజం అనే లక్షణమే. ఫొటోట్రాపిజం అంటే, కంటికి కనిపించే సూర్యరశ్మి వలన మొక్క పెరుగుదలతోపాటు కలిగే ప్రతిస్పందన అని చెప్పుకోవచ్చు. పొద్దుతిరుగుడు మొక్క కాండంలో ఉండే 'ఆక్సిన్‌' అనే హార్మోన్‌ ఈ స్పందనను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్‌ మొక్కలు పొడవుగా, ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది. మొక్కల్లో ఉన్న ఎమినో ఆసిడ్‌ వల్లగాని, కార్బోహైడ్రేటులో విచ్ఛిన్నం కావడం వల్ల గాని ఈ హార్మోన్‌ ఏర్పడుతుంది. ఈ హార్మోన్‌ మొక్కలో ఉన్న కణాల గోడలపై ఉన్న కార్బోహైడ్రేటుల బంధాలపై పనిచేస్తాయి. తద్వారా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయట. ఈ రెండిటి బంధానికి మూలం ఫొటోట్రాపిజం అనే లక్షణమే అనవచ్చు. శ్రీ.కో

Similar News