ఎవరెస్టు పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా!

ఎవరెస్టు పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా! ఒకప్పుడు ఎవరెస్ట్నునేపాల్‌ దేశస్థులు 'సరగ్‌ మాతా' అని పిలిచేవారట.

Update: 2018-12-31 06:33 GMT
Mount Everest

ఎవరెస్టు పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా! ఒకప్పుడు ఎవరెస్ట్నునేపాల్‌ దేశస్థులు 'సరగ్‌ మాతా' అని పిలిచేవారట. అయితే 1852లో భారత ప్రభుత్వం ఈ పర్వతానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఒక పర్యవేక్షక బృందాన్ని అక్కడకు పంపింది. ఆ బృందంలో జనరల్‌ సర్‌ జార్జ్‌ ఎవరెస్ట్‌ అనే ఒక సర్వేయరు ఉన్నాడు. ఆ బృందంలోనే రాధానాథ్‌ సికందర్‌ అనే వ్యక్తి ఎంతో కష్టపడి ఈ శిఖరాన్ని గురించి అనేక విషయాలు సేకరించాడు. తనకు లభించిన సమాచారాన్నంతా జార్జ్‌ ఎవరెస్టుకు పంపుతుండేవాడు సికందర్‌. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈ శిఖరానికి పేరు పెట్టడం గురించి చర్చకు వచ్చినప్పుడు మాత్రం జార్జ్‌ ఎవరెస్ట్‌ పేరు ప్రతిపాదనకు వచ్చింది. అలా శ్రమ, కష్టం ఒకరిదైతే, పేరు మాత్రం జార్జ్‌ ఎవరెస్ట్‌కు దక్కింది అని అంటారు. శ్రీ.కో

Similar News