Maruti June Discount: సూపర్‌ ఆఫర్‌.. మారుతి విలువైన కారుపై రూ.60 వేల తగ్గింపు..!

Maruti June Discount: కార్ల కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి, స్టాక్‌ను క్లియర్ చేయడానికి తరచుగా డిస్కౌంట్ ఆఫర్‌లని ప్రకటిస్తాయి.

Update: 2023-06-12 07:32 GMT

Maruti June Discount: సూపర్‌ ఆఫర్‌.. మారుతి విలువైన కారుపై రూ.60 వేల తగ్గింపు..!

Maruti June Discount: కార్ల కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి, స్టాక్‌ను క్లియర్ చేయడానికి తరచుగా డిస్కౌంట్ ఆఫర్‌లని ప్రకటిస్తాయి. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు అయిన మారుతీ సుజుకీ జూన్ నెలలో తన కార్లపై డిస్కౌంట్‌ ప్రకటించింది. 4 లక్షల రూపాయల ఆల్టో కె10 కారుపై దాదాపు 60 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. ఇందులో నగదు తగ్గింపులు, బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మారుతి ఆల్టో కె10పై తగ్గింపులు

జూన్ 2023 నెలలో ఆసక్తిగల కొనుగోలుదారులు మారుతి సుజుకి ఆల్టో K10పై రూ. 59,000 వరకు తగ్గింపును పొందవచ్చు. పెట్రోల్ వెర్షన్ పై రూ.40,000 నగదు తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,000 కార్పొరేట్ తగ్గింపు వర్తిస్తుంది. అదే సమయంలో CNG వేరియంట్‌పై రూ. 20,000 వరకు నగదు తగ్గింపు, రూ. 4,000 కార్పొరేట్ తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ వర్తిస్తుంది.

ఆల్టో కె10 ధర

ఆల్టో కె10 ధర రూ. 3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇది నాలుగు వేరియంట్లలో ఉంటుంది. Std (O), LXi, VXi, VXi+ అలాగే కస్టమర్లు దీన్ని ఆరు మోనోటోన్ షేడ్స్‌లో కొనుగోలు చేయవచ్చు. మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, మెటాలిక్ స్పీడీ బ్లూ, ప్రీమియం ఎర్త్ గోల్డ్, సాలిడ్ వైట్.

నిబంధనలు & షరతులు

ఈ ఆఫర్ జూన్ 30, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రాంతం, డీలర్‌షిప్, వెర్షన్, రంగు, ఇతర అంశాల ఆధారంగా మారవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తిగల కొనుగోలుదారులు సమీపంలోని అధీకృత మారుతి సుజుకి షోరూమ్‌ను సంప్రదించవచ్చు.

Tags:    

Similar News