Car Journey: కారులో దూర ప్రయాణాలకి వెళుతున్నారా.. కచ్చితంగా వీటిని చెక్ చేయండి..!
Car Journey: కారులో దూర ప్రయణం చేయడమంటే చాలామందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి సెలవులలో తరచుగా ప్రయాణాలు చేస్తారు.
Car Journey: కారులో దూర ప్రయాణాలకి వెళుతున్నారా.. కచ్చితంగా వీటిని చెక్ చేయండి..!
Car Journey: కారులో దూర ప్రయణం చేయడమంటే చాలామందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి సెలవులలో తరచుగా ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఎలాంటి ప్లాన్ చేయకుండా విహారయాత్రకు వెళితే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎలాంటి వాటిపై దృష్టి పెట్టాలో ఈరోజు తెలుసుకుందాం.
టైర్లలో గాలి
మీరు లాంగ్ ట్రిప్‌కు వెళుతున్నట్లయితే ముందుగా కారులో పెట్రోల్ చెక్ చేసుకోవాలి. తర్వాత కారులోని నాలుగు టైర్లలో గాలిని చెక్ చేసుకోవాలి. వాతావరణానికి అనుగుణంగా టైర్లలలో గాలి నింపాలని గుర్తుంచుకోండి. వేసవి కాలంలో గాలి కొద్దిగా తక్కువగా శీతాకాలంలో కొంచెం ఎక్కువగా ఉండాలి.
స్పేర్ టైర్
కారు పంక్చర్ అయినప్పుడు స్పేర్ టైర్ దగ్గర ఉండాలి. అంతేకాదు అందులో సరిపడ గాలి ఉందో లేదో చెక్ చేయాలి. వీలైతే దానిని 5psi ఎక్కువ గాలితో నింపాలి. తద్వారా గాలి చాలా కాలం వరకు తగ్గకుండా ఉంటుంది.
కూలెంట్, బ్రేక్ ఫ్లూయిడ్
దూర ప్రయాణాలకు వెళుతున్నప్పుడు గంటల తరబడి కారును ఉపయోగిస్తారు. ఇది నేరుగా కారు ఇంజిన్‌ను ప్రభావితం చేస్తుంది. అది వేడెక్కడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితిలో కారులో మంటలు వ్యాపించవచ్చు. అందుకే కారులో కూలెంట్, బ్రేక్ ఫ్లూయిడ్‌ను టాప్ అప్ చేయాలి.
ఇంజిన్ ఆయిల్
కారులో దూర ప్రయాణాళకి వెళ్లినప్పుడు ఇంజిన్ ఆయిల్ చెక్ చేయాలి. ఇది తక్కువగా ఉంటే వెంటనే ఇంజిన్ ఆయిల్ పోయిలి. ఇంజిన్ కండిషన్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి.
PUC సర్టిఫికేట్
కారులో దూర ప్రయాణాలకి వెళ్లే ముందు కారుకి సంబంధించి అన్ని పత్రాలను తనిఖీ చేయాలి. ముఖ్యంగా పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు ఉందా లేదా చూసుకోవాలి. చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC) లేకుంటే చలాన్ కట్టాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.