New Car Buying Tips: కొత్త కారు కొనేటప్పుడు ఈ విధంగా డిస్కౌంట్ పొందండి.. కొంత మొత్తాన్ని ఆదా చేయండి..!
New Car Buying Tips: కరోనా వచ్చినప్పటి నుంచి దేశంలో కార్ల కొనుగోలు రోజు రోజుకి పెరుగుతోంది.
New Car Buying Tips: కొత్త కారు కొనేటప్పుడు ఈ విధంగా డిస్కౌంట్ పొందండి.. కొంత మొత్తాన్ని ఆదా చేయండి..!
New Car Buying Tips: కరోనా వచ్చినప్పటి నుంచి దేశంలో కార్ల కొనుగోలు రోజు రోజుకి పెరుగుతోంది. ప్రతినెలా లక్షలాది కార్లు అమ్ముడవుతున్నాయి. అయితే కొత్తకారు కొనేటప్పుడు కొన్ని చిట్కాలని పాటించాలి. లేదంటే కారు డీలర్ల చేతిలో మోసాలకి గురికావాల్సి ఉంటుంది. ఎక్స్-షోరూమ్ ధరతో పాటు, రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్‌తో సహా వివిధ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో కారు ఆన్-రోడ్ ధర ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కస్టమర్‌లు కొత్త కారు విషయంలో డీలర్‌షిప్ కొంత తగ్గింపును అందించాలని కోరుకుంటారు. కానీ ఇది అంత సులభం కాదు. వాస్తవానికి కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం.
1. కారు కంపెనీలు కొన్ని మోడళ్లపై తగ్గింపుని ప్రకటిస్తాయి. కారు కొనడానికి వెళ్లినప్పుడు ఒకసారి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలి. దీనివల్ల ఆఫర్లు ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది.
2. మార్కెట్‌లో ఏదైనా పాపులర్ కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే దానిపై తగ్గింపు పొందడం కష్టం. అయితే నిజంగా కొంత డబ్బు ఆదా చేయాలంటే కారు డీలర్ నుంచి వెహికిల్ ఇన్సూరెన్స్ ఎంచుకోవద్దు. ఇందుకోసం ఆన్‌లైన్ ఎంపిక ఉత్తమమని చెప్పవచ్చు.
3. మూడో పద్ధతి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ బాగా పనిచేస్తుంది. ముందుగా షోరూమ్‌కి వెళ్లి కారు పూర్తి రేటును తెలుసుకోవాలి. తర్వాత రెండో షోరూమ్‌కి వెళ్లి మొదటి షోరూమ్‌లో డిస్కౌంట్ ఉందని చెప్పాలి. తర్వాత మూడో షోరూమ్‌కి వెళ్లి అదే చేయాలి. ఇలా తిరగడం కొంచెం కష్టమైన పనే కానీ ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది.
4. లక్ష వరకు తగ్గింపు
మీ దగ్గర 15 సంవత్సరాల కంటే పాత కారు ఉంటే దానిని స్క్రాప్ చేయవచ్చు. దీనివల్ల మీకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. దీని ద్వారా కొత్త కారు కొనుగోలుపై లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు.