Manual Car Driving: మాన్యువల్ కారు నడిపేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
Manual Car Driving: దేశంలో ప్రస్తుతం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్ల అమ్మకాలు పెరిగాయి. అయితే ఇప్పటికీ కొంతమంది మాన్యువల్ కార్లను ఉపయోగిస్తున్నారు.
Manual Car Driving: మాన్యువల్ కారు నడిపేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
Manual Car Driving: దేశంలో ప్రస్తుతం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్ల అమ్మకాలు పెరిగాయి. అయితే ఇప్పటికీ కొంతమంది మాన్యువల్ కార్లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారి లిస్టులో మీరుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే భారీ నష్టాన్ని చవిచూస్తారు. ముఖ్యంగా మాన్యువల్ కార్లని నడిపేటప్పుడు కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
గేర్ షిఫ్టర్‌పై చేయి వేయవద్దు
గేర్ షిఫ్టర్‌పై చేతిని ఉంచడం వల్ల ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌పై ఒత్తిడి ఏర్పడుతుంది. గేర్‌లను మార్చేటప్పుడు మాత్రమే గేర్ షిఫ్టర్‌ను తాకాలి. మిగిలిన సమయంలో చేతిని పెట్టకూడదు. డ్రైవింగ్ చేసేటప్పుడు కచ్చితంగా రెండు చేతులను స్టీరింగ్‌పై ఉంచాలని గుర్తుంచుకోండి.
క్లచ్ పెడల్ మీద కాలు పెట్టవద్దు
కొంతమందికి క్లచ్ మీద కాలు పెట్టుకుని డ్రైవ్ చేసే అలవాటు ఉంటుంది. ఇలా అస్సలు చేయకూడదు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్లచ్ పెడల్‌పై పాదాలను ఉంచడం వల్ల అది పాడయ్యే అవకాశాలు పెరుగుతాయి. అవసరమైనప్పుడు మాత్రమే క్లచ్‌ని తొక్కాలి.
క్లచ్‌ను పూర్తిగా తొక్కకుండా గేర్ మార్చవద్దు
మాన్యువల్ కార్లలో గేర్‌లను మార్చడానికి డ్రైవర్ స్వయంగా క్లచ్‌ను తొక్కాలి. అయితే క్లచ్ని పూర్తిగా తొక్కడం అలవాటు చేసుకోవాలి. వాస్తవానికి కొన్నిసార్లు ప్రజలు క్లచ్‌ను పూర్తిగా తొక్కరు సగం వరకే తొక్కి హడావిడిగా గేర్‌లను మారుస్తారు. ఇలా చేయడం తప్పు. ఇది గేర్‌బాక్స్‌కు నష్టం కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది.
వేగం తగ్గించడానికి డౌన్‌షిఫ్ట్ చేయవద్దు
కారు వేగం తగ్గించడానికి డౌన్‌షిఫ్ట్ చేయవద్దు. బ్రేక్ ఫెయిల్యూర్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇది చేయవచ్చు కానీ సాధారణ డ్రైవింగ్ సమయంలో చేయకూడదు. ఇది ట్రాన్స్మిషన్, క్లచ్ను ప్రభావితం చేస్తుంది కాబట్టి సాధారణ బ్రేకింగ్ కోసం దీనిని వాడకూడదని గుర్తుంచుకోండి.