Vastu: ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే ఏమవుతుందో తెలుసా.?
తులసి మొక్కను హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు.
Vastu: ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే ఏమవుతుందో తెలుసా.?
తులసి మొక్కను హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆవరణాన్ని శుభ్రంగా ఉంచే శక్తిని కలిగి ఉంటుంది. తులసి వృద్ధి చెందే చోట నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది, సానుకూలత పెరుగుతుంది.
ధార్మిక గ్రంథాల్లో తులసిని శ్రీమహాలక్ష్మీ కటాక్షంగా గుర్తించారు. అందుకే ఈ మొక్కను ఇంట్లో ఉంచటం వల్ల సంపద, ఆరోగ్యం, శాంతి వంటి శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. వేద శాస్త్రాలు తులసిని భక్తి, పవిత్రత, ఆయుష్షు, ఐశ్వర్యానికి చిహ్నంగా వర్ణించాయి. పురాణ కథనాల్లో, తులసి దళాలు శ్రీహరి హృదయానికి అత్యంత ప్రియమైనవిగా చెప్పబడినాయి. అందుకే వైష్ణవ సంప్రదాయంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
ఎన్ని తులసి మొక్కలు పెంచాలి?
ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉండాలని నమ్మకం ఉంది. ఒకదానికంటే ఎక్కువ మొక్కలు పెంచాలనుకుంటే, అవి బేసి (odd) సంఖ్యలలో ఉండేలా చూడాలి ఉదాహరణకు 3, 5, 7 మొక్కలు. ఇది శాస్త్రపరంగానూ, జ్యోతిషపరంగానూ శుభంగా పరిగణించబడుతుంది. సరి సంఖ్యలో ఉండకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ప్రతి మొక్కను శుభ్రంగా ఉంచడం, చుట్టుపక్కల చెత్త లేదా పాదరక్షలు ఉండకుండా చూసుకోవడం ఎంతో అవసరం.
తులసి మొక్కను తూర్పు లేదా ఈశాన్య దిక్కులో ఉంచడం ఉత్తమం. మొక్క నేలను తాకకుండా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం దీపం వెలిగించడం, నీళ్లు పోయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మాంసాహారం తీసుకున్న రోజున మొక్కను తాకకూడదు. తులసిని నాటేందుకు గురువారం అనుకూలమైందిగా చెబుతుంటారు. ఈ రోజు నాటితే కుటుంబానికి ఆర్థికంగా స్థిరత కలుగుతుందని చెబుతుంటారు.