Vastu Tips: జీవితం ప్ర‌శాంతంగా ఉండాలంటే.. ఈ వాస్తు చిట్కాలు పాటించాల్సిందే

Vastu Tips: మ‌నిషి శారీర‌క ఆరోగ్యంతో పాటు, మాన‌సిక ఆరోగ్యంపై కూడా వాస్తు ప్ర‌భావం ఉంటుంద‌ని పండితులు చెబుతుంటారు.

Update: 2025-05-01 02:00 GMT

Vastu Tips: జీవితం ప్ర‌శాంతంగా ఉండాలంటే.. ఈ వాస్తు చిట్కాలు పాటించాల్సిందే

Vastu Tips: మ‌నిషి శారీర‌క ఆరోగ్యంతో పాటు, మాన‌సిక ఆరోగ్యంపై కూడా వాస్తు ప్ర‌భావం ఉంటుంద‌ని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా సానుకూల శక్తిని ఆకర్షించాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను పాటించాల‌ని సూచిస్తుంటారు. ఇంట్లో మాన‌సిక ప్ర‌శాంతతా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని బేసిక్ వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* ఇంట్లో ముళ్లతో కూడిన మొక్కలు, ముఖ్యంగా గులాబీ మొక్కలు పెంచడం వల్ల ప్రతికూల శక్తి పెరిగే అవకాశముంటుంది. అందుకే ఇలాంటి మొక్కలను నివాస ప్రదేశాల్లో ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే, క్యాక్టస్ మొక్క విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయం ఉంది. ఇంటిని నిర్మించే సమయంలో క్యాక్టస్ మొక్కను కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉంచితే, నరదృష్టి ప్రభావం తగ్గుతుంది.

* ఇల్లు నిర్మించిన అనంతరం చుట్టుపక్కల చెక్కలు, ఇటుకలు, ఇసుక వంటి మిగిలిపోయిన నిర్మాణ సామగ్రిని వెంటనే తొలగించాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే సానుకూల శక్తికి మార్గం ఏర్పడుతుంది.

* ఇంట్లో పగిలిపోయిన వస్తువులు, వాడలేని వాటిని తక్షణమే తొలగించాలి. నలుగురు గుర్తించకపోయినా, ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా నీరు కారుతున్న కుళాయిలు, పని చేయని తలుపుల హ్యాండిల్స్ వంటి వాటిని త్వరగా బాగుచేయడం అవసరం.

* ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఇది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అలాగే ఈశాన్యం, నైరుతి దిశల్లో కూడా శుభ్రతను పాటించాలి. ఇలా చేస్తే ఇంట్లో శుభత, శాంతి, ఆనందం ఏర్పడతాయని వాస్తు నిపుణుల అభిప్రాయం.

Tags:    

Similar News