Shani Vakri: శని అనుగ్రహం.. 135 రోజులు ఈ రాశికి సంపద, సమాజంలో గౌరవం

Shani Vakri 2025: శని అనుగ్రహం వల్ల ఈ రాశికి అశేష రాజయోగం కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్‌ చేయండి.

Update: 2025-04-13 00:30 GMT

Shani Vakri: శని అనుగ్రహం.. 135 రోజులు ఈ రాశికి సంపద, సమాజంలో గౌరవం

Shani Vakri 2025: శని దేవుడు తిరోగమనం చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో నవంబర్ 28 వరకు మీనరాశిలోనే ఉండబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశులకు రాజయోగం కలుగుతుంది. అంతేకాదు శని దేవుడి వల్ల వీరికి లగ్జరీ లైఫ్ సొంతం అవుతుంది.

కన్య రాశి..

కన్య రాశి వారికి శని వల్ల అశేష యోగం కలుగుతుంది. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. కన్యా రాశి వారు కుటుంబీకుల సలహాల మేరకు ముందుకు వెళ్లగలిగితే ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది.

కుంభరాశి..

కుంభరాశి వారికి కూడా శని తిరోగమనం వల్ల కష్టాలకు తగిన ఫలితం లభిస్తుంది. ఈ నేపథ్యంలో వారికి వైవాహిక జీవితంలో మంచిది. అంతే కాదు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఈ కాలంలో వీరికి హాయిగా సాగిపోయే రోజులని చెప్పొచ్చు.

మకర రాశి..

మకర రాశి వారు కూడా సమాజంలో గౌరవ పెరుగుతుంది. ప్రధానంగా వీకె చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందే సమయం. కొత్త పనులు ప్రారంభించవచ్చు. విశేష రాజయోగం కలుగుతుంది. అంతేకాదు వీళ్ళకి ఆకస్మిక ధనయోగం కూడా కలగటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయవచ్చు.

మేష రాశి..

మేష రాశి వారికి కూడా కెరీర్‌లో పురోగతి అందుకుంటారు. అంతేకాదు వీరికి వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించిన ఆర్థిక ప్రయోజనాలు విశేషంగా కలుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే సమయం విద్యార్థులకు మంచిది. అంతేకాదు కుటుంబంలో వీరికి గొడవ లేకుండా సాగిపోతుంది.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HMTV Telugu దీన్ని ధృవీకరించలేదు, నిర్ధారించే ముందు నిపుణులను సంప్రదించండి)

Tags:    

Similar News