Rahu Ketu retrograde: రాహు కేతు తిరోగమనం.. ఈ 3 రాశులకు ఆర్థిక సంక్షోభం

Rahu Ketu Retrogade: గ్రహాల కదిలికలు కచ్చితంగా 12 రాశులపై పడతాయి. ఇది శుభం కావచ్చు ఆ శుభం కావచ్చు.

Update: 2025-04-24 02:30 GMT

Rahu Ketu retrograde: రాహు కేతు తిరోగమనం.. ఈ 3 రాశులకు ఆర్థిక సంక్షోభం

Rahu Ketu Retrogade: గ్రహాల కదిలికలు కచ్చితంగా 12 రాశులపై పడతాయి. ఇది శుభం కావచ్చు ఆ శుభం కావచ్చు.

రాహు కేతువులు నీడ గ్రహాలు అంటారు. వీటి సంచారం వల్ల మూడు రాశులకు ఆర్థిక సంక్షోభం తప్పదు. మే 18వ తారీకు రాహు మీనరాశి నుండి కుంభ రాశిలోకి వెళ్తాడు.. ఇదిలా ఉండగా కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి వెళ్తాడు. ఈ నేపథ్యంలో మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు తప్పవు.

సింహరాశి..

సింహరాశి కారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ రాహు, కేతువుల తిరోగమనం వల్ల మీ జీవితంలో నష్టాలను తీసుకువస్తాయి. దీంతో లావాదేవీలు జరిగేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. అంతేకాదు మీ కుటుంబ జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పై కూడా జాగ్రత్త వహించాలి.

మీన రాశి..

ఇది ఈ రెండు గ్రహాల తిరోగమన వల్ల మీన రాశి వారికి కూడా నష్టాలను చూస్తారు. అంతేకాదు కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది.

మేష రాశి ..

రాహు కేతువుల రాశి మార్పు వల్ల మేషరాశి వారికి కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కెరీర్ పట్ల వీళ్లకు నష్టాలు తప్పవు. ఏ కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మంచిది. పెండింగ్‌లో పనులు పడిపోతాయి. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు నివారించుకోవడం మంచిది.

Tags:    

Similar News