Most Luckiest Zodiac Signs in July: జూలై నెలలో శక్తివంతమైన నవగ్రహాల ఎఫెక్ట్.. ఈ 5 రాశుల వారికి ఊహించని డబ్బు..
Most Luckiest Zodiac Signs in July: జూలై 2025లో గ్రహాల సంచారంతో అనేక రాశుల జీవితాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
Most Luckiest Zodiac Signs in July: జూలై నెలలో శక్తివంతమైన నవగ్రహాల ఎఫెక్ట్.. ఈ 5 రాశుల వారికి ఊహించని డబ్బు..
Most Luckiest Zodiac Signs in July: జూలై 2025లో గ్రహాల సంచారంతో అనేక రాశుల జీవితాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నెలలో ముఖ్యమైన 7 గ్రహాలు తమ రాశులను మారుస్తుండగా, కొన్ని రాశులకు ప్రత్యేకంగా శుభ ఫలితాలు అందనున్నాయి. ముఖ్యంగా వృషభ, మేష, వృశ్చిక, కుంభ, కన్య రాశులకు ఈ జూలై నెల ఎంతో అనుకూలంగా మారబోతోంది.
జూలై 2025 ముఖ్యమైన గ్రహ సంచారాలు
జూలై 9 : బృహస్పతి మిథున రాశిలోకి
జూలై 13 : శని మీన రాశిలో వక్రగమనంలో
జూలై 16 : సూర్యుడు కర్కాటక రాశిలోకి
జూలై 18 : బుధుడు కర్కాటకంలో వక్రగమనంలోకి
జూలై 24 : బుధుడు కర్కాటకంలో అస్తమయం
జూలై 26 : శుక్రుడు మిథున రాశిలోకి
జూలై 28 : కుజుడు కన్య రాశిలోకి
ఈ గ్రహ సంచారాల ప్రభావంతో ఈ ఐదు రాశుల వారు అదృష్టవంతులవుతారు.
వృషభ రాశి
ఈ నెల వృషభ రాశి వారికి శుభ వార్తలే. ఇప్పటివరకు ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో అభివృద్ధి, సమాజంలో గౌరవం, పెండింగ్ పనులు పూర్తి, కొత్త బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మొత్తం మీద జీవితం సుఖంగా ఉంటుంది.
మేష రాశి
జూలైలో గ్రహాల అనుకూలతతో మేష రాశి వారికి అనేక లాభాలు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో పనితీరు మెరుగుపడుతుంది. నిర్ణయం తీసుకునే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, ఖర్చులు తగ్గడం, దాంపత్య జీవితం సాఫీగా సాగడం జరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఇదే సరైన సమయం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి జూలైలో అవకాశాలు పెరుగుతాయి. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. స్నేహితులు, కుటుంబసభ్యులతో ప్రేమ, అనురాగం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. నిపుణుల సలహాతో ముందడుగు వేయాలి.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ నెల శుభపరిణామాలు. కృషికి తగిన ఫలితం. వ్యాపార లాభాలు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. దాంపత్య జీవితంలో ఆనందం. విద్యార్థులకు ఇది శుభ సమయం. పరస్పర సంబంధాలు మెరుగవుతాయి. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.
కన్య రాశి
కన్యరాశి వారికి అదృష్ట సమయం. ఉద్యోగంలో అభినందనలు, సమాజంలో గౌరవం. విద్యార్థులకు పరీక్షల్లో విజయం. స్థిరాస్తి కొనుగోలు, కొత్త పెట్టుబడులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లాభాలు, ఉద్యోగ భద్రత కలుగుతుంది.
ఈ జూలైలో గ్రహాల సంచార ప్రభావం వల్ల వృషభ, మేష, వృశ్చిక, కుంభ, కన్య రాశుల వారు అనుకోని అదృష్టాన్ని, సంపదను, శుభ సమాచారాన్ని పొందబోతున్నారు. కొత్త మార్గాలు, అవకాశాలు దక్కబోతున్నాయి. మీ రాశి గ్రహ ఫలితాలు తెలుసుకొని ప్లాన్ చేసుకోండి!
గమనిక: ఈ విషయాన్ని పంచాంగాలు, జ్యోతిస్య పండితులు చెప్పిన దాన్నే మీకు అందించాము. సనాతన హిందూ సంప్రదాయంలో నవగ్రహాల కదలిక ఆధారంగా ఇవ్వబడింది. hmtv దీన్ని ధృవీకరించడం లేదు.