Saturday Astro Tips: శనివారం ఈ పొరపాట్లు అస్సలు చేయవద్దు.. శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు..!
Saturday Astro Tips: హిందూ సంప్రదాయం ప్రకారం శనివారం కొన్నిపద్దతులు పాటించాలి.
Saturday Astro Tips: శనివారం ఈ పొరపాట్లు అస్సలు చేయవద్దు.. శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు..!
Saturday Astro Tips: హిందూ సంప్రదాయం ప్రకారం శనివారం కొన్నిపద్దతులు పాటించాలి. లేదంటే ఇబ్బందుల్లో పడుతారు. జ్యోతిష్యం ప్రకారం శనివారం శనిదేవుడి రోజు. ఇతడినే కలి యుగ దేవుడిగా, న్యాయదేవుడిగా పిలుస్తారు. శని దేవుడు ఒక వ్యక్తికి అతని మంచి, చెడు పనుల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. ఈ రోజు ఉపవాసం, పూజ చేయడం వల్ల జీవితంలో సమస్యల నుంచి బయటపడవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం, కానీ చిన్న పొరపాటు చేసినా అతడికి చాలా కోపం వస్తుంది. అందుకే శనివారం కొన్ని వస్తువులు కొనడం నిషేధం. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ఉప్పు కొనడం అశుభం. ఈ రోజున ఉప్పు కొంటే శనిదేవుడికి కోపం వస్తుంది. ఇది మాత్రమే కాదు ఆ వ్యక్తి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంట్లో పేదరికం వస్తుంది. శాస్త్రాల ప్రకారం శనివారం ఆవాల నూనెను కొనుగోలు చేయకూడదు. దీనివల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే శనివారం ఇనుప వస్తువులు కొనడం నిషేధం. దీని వల్ల శనిదేవుని ఆగ్రహానికి గురికావలసి ఉంటుంది.
శనివారం నల్ల పెసరపప్పు కొనకూడదు. కానీ ఈ రోజున దీనిని పేదలకు దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడు అతడి ఆశీర్వాదం లభిస్తుంది. అంతే కాదు శని దోషం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శనివారం కత్తెర, చీపురు వంటివి కొనడం మానుకోవా లి. దీని వల్ల కుటుంబంలో తగాదాలు పెరిగే అవకాశం ఉంది. శనివారం ఒక వ్యక్తి నలుపు రంగు దుస్తులు, బూట్లు కొనుగోలు చేయవద్దు. ఈ రోజున బొగ్గు మొదలైన వాటిని కొనుగోలు చేయడం అశుభం.