Raja Yogam: 18 యేళ్ల తర్వాత రాహు, శుక్ర కలయికతో అపూర్వ రాజయోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..

Raja Yogam: గ్రహమండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూనే ఉంటాయి.

Update: 2025-08-20 07:09 GMT

Raja Yogam: 18 యేళ్ల తర్వాత రాహు, శుక్ర కలయికతో అపూర్వ రాజయోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..

Raja Yogam: గ్రహమండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూనే ఉంటాయి. ఈ మార్పులు వ్యక్తుల జీవితాలపై, సమాజంపై, ఇంకా ప్రపంచ స్థాయిలో కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఒక గ్రహం మరొక గ్రహంతో కలిసినపుడు కొన్ని విశేష యోగాలు ఏర్పడతాయి.

సెప్టెంబర్‌లో శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే కేతువు సింహరాశిలో సంచరిస్తున్నందున, శుక్ర-కేతువు సంయోగం త్వరలోనే సంభవించనుంది. ఈ సంయోగం మూడు రాశులకు అదృష్టాన్ని, కొత్త అవకాశాలను, ఆర్థిక వృద్ధిని తీసుకురానుంది.

వృశ్చిక రాశి

రాహు-కేతు ప్రభావం వలన వృశ్చిక రాశి వారు కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి విజయాన్ని అందుకుంటారు. నాయకత్వ బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. మీ ప్రతిభ, నైపుణ్యాలు మరింత మెరుగవుతాయి.

వృషభ రాశి

శుక్ర-రాహు కలయిక వృషభ రాశి వారికి ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలను కలిగిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పేరు ప్రతిష్ఠలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం మీ పనిలో విజయాన్ని తీసుకొస్తుంది.

కర్కాటక రాశి

రాహు-శుక్ర ప్రభావం కర్కాటక రాశి వారికి ఊహించని లాభాలను అందిస్తుంది. పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. యువతకు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే పాత బాకీలు తిరిగి వసూలు అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి, శుక్ర-కేతు సంయోగం వృశ్చిక, వృషభ, కర్కాటక రాశి వారికి ప్రత్యేక అదృష్టాన్ని తీసుకురానుంది.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని hmtv NEWS ధృవీకరించడం లేదు. 

Tags:    

Similar News