Vastu Tips: ఈ తప్పులు తెలుసుకోపోతే ఖర్చులు ఆగవు.. డబ్బు పొదుపు కాదు..!

Vastu Tips:ఈ రోజుల్లో చాలామంది బాగా సంపాదిస్తున్నారు కానీ నెల చివరలో ఒక్క పైసా ఉండడం లేదు. దీనికి కారణం తెలిసి తెలియక చేసే తప్పులే. ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు కారణం అవుతుంది.

Update: 2024-01-06 01:30 GMT

Vastu Tips: ఈ తప్పులు తెలుసుకోపోతే ఖర్చులు ఆగవు.. డబ్బు పొదుపు కాదు..!

Vastu Tips: ఈ రోజుల్లో చాలామంది బాగా సంపాదిస్తున్నారు కానీ నెల చివరలో ఒక్క పైసా ఉండడం లేదు. దీనికి కారణం తెలిసి తెలియక చేసే తప్పులే. ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు కారణం అవుతుంది. వాస్తు నియమాలు పాటించకపోతే ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత సంపాదించినా ఒక రూపాయి పొదుపు చేయలేకపోతాడు. సంపాదించినా డబ్బులు మిగలకపోతే అది వాస్తు దోశం అవుతుంది. ఇలాంటి పొరపాట్లు చేయవద్దు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం పర్సు ఖాళీగా ఉండటానికి ముఖ్య కారణం అందులో డబ్బు కంటే అనవసర వస్తువులు ఎక్కువగా ఉండడం. పర్స్ అనేది డబ్బును ఉంచడానికి వాడే ఒక వస్తువు. దీనిలో అనవసరమైన కాగితాలు లేదా ఇతర వస్తువులను ఉంచకూడదు.

చాలా మంది డబ్బును లెక్కించేటప్పుడు నోట్లో వేలు పెట్టి తడి చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఎంత డబ్బు సంపాదించినా కొరతే ఉంటుంది. అందుకే ఈ పద్దతిలో నోట్లు లెక్కపెట్టే అలవాటు మానుకోవాలి.

లక్ష్మీదేవి కొలువై ఉండే ఇళ్లలో డబ్బుకు లోటు ఉండదు. అయితే ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ మాత్రమే తల్లి లక్ష్మి నివసిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఆశీర్వాదం కావాలంటే ఇంటి పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవాలి.

ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి పరిష్కారాలు కూడా వాస్తు శాస్త్రంలో చెప్పారు. ఇంటిని శుభ్రంగా చక్కగా ఉంచుకోవడం, వాస్తు ప్రకారం వస్తువులను సరైన దిశలో ఉంచడం, పూజ గదిలో శంఖాన్ని ఉంచడం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో డబ్బు, ఆనందం, సంతోషం అన్నీ ఉంటాయి.

Tags:    

Similar News