Solar Eclipse 2024: ఉగాదికి ఒక్కరోజు ముందు సూర్యగ్రహణం.. ఏ రాశులపై ప్రభావం పడుతుందంటే..!

Solar Eclipse 2024: ఈ ఏడాది హోలీరోజున మొట్టమొదటి చంద్రగ్రహణం సంభవించింది. అలాగే ఏప్రిల్‌ నెలలో మొదటి సూర్యగ్రహణం రాబోతుంది.

Update: 2024-04-01 14:30 GMT

Solar Eclipse 2024: ఉగాదికి ఒక్కరోజు ముందు సూర్యగ్రహణం.. ఏ రాశులపై ప్రభావం పడుతుందంటే..!

Solar Eclipse 2024: ఈ ఏడాది హోలీరోజున మొట్టమొదటి చంద్రగ్రహణం సంభవించింది. అలాగే ఏప్రిల్‌ నెలలో మొదటి సూర్యగ్రహణం రాబోతుంది. ఇది సరిగ్గా ఉగాదికి ఒక్కరోజు ముందు అంటే ఏప్రిల్‌ 8 అర్దరాత్రి సమయంలో సంభవిస్తుంది. మతపరంగా, జ్యోతిష్యశాస్త్ర పరంగా సూర్యగ్రహణం చాలా ముఖ్యమైనది. మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8, 9 మధ్య రాత్రి ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2:22 గంటల వరకు ఉంటుంది. గ్రహణానికి 12 గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. అయితే చంద్రగ్రహణం మాదిరి ఈ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా భారతదేశంలో గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు.

ఈ ఏడాది చైత్ర అమావాస్య ఏప్రిల్ 8న, చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమవుతు న్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు చేయడం నిషిద్ధం. గ్రహణం సమయంలో రాహు-కేతువుల ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు. ఈ సూర్యగ్రహణం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. వృషభ, మిథున, సింహ రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతున్నప్పటికీ మేష, తుల, కుంభ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది మెక్సికో మీదుగా అమెరికా కెనడాలో కనిపిస్తుంది. జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం సూర్యగ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు. గ్రహణ సమయంలో భగవంతుడిని తలచుకోవాలని చెబుతారు. సూర్యగ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలి. సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష కళ్లతో చూడకూడదని గుర్తుంచుకోండి. సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణం నియమాలు వర్తించవు.

Tags:    

Similar News