వైయస్ వివేకానందరెడ్డి కన్నుమూత

Update: 2019-03-15 01:45 GMT

వైయస్ కుటుంబంలో విషాదం నెలకొంది. మాజీ ఎంపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జగన్ బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయిన వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలో మృతిచెందారు. వైఎస్‌ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. వైఎస్సార్‌కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు.

1989,1994లలో పులివెందుల నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 లలో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. బాబాయ్ మృతిచెందిన విషయాన్నీ తెలుసుకున్న జగన్ హుటాహుటిన కుటుంబసభ్యులతో కలిసి పులివెందులకు బయలుదేరారు. వివేకా మృతితో రాష్ట్రవ్యాప్తంగా వైయస్ అభిమానులు శోఖసముద్రంలో మునిగిపోయారు.

Similar News