మళ్ళీ జనం బాట పట్టిన జగన్.. ఈసారి..

Update: 2019-02-06 02:58 GMT

సుమారు 3700 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన తర్వాత వైసీపీ అధినేత వైయస్ జగన్ మరోసారి జనం బాట పట్టారు. 'అన్న పిలుపు' 'సమర శంఖారావం' పేరుతో తటస్థులు, బూత్ లెవల్ కమిటీ కన్వీనర్లు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కో ఆర్టినేటర్లతో విస్తృత స్ధాయి సమావేశాలు నిర్వహించనున్నారు. పాదయాత్ర సందర్భంగా గుర్తించిన తటస్దులకు ఇప్పటికే ఆయన లేఖలు రాసారు. దీనికి సంబంధించి తొలి సమావేశం ఇటీవలే లోటస్ పాండ్ లో నిర్వహించారు. నేడు తిరుపతిలో తటస్థులతోపాటు పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో నిర్వహిస్తున్న సమావేశంలో ఆయన పాల్గొంటారు.

రెండో రోజైన 7వ తేదీన వైఎస్సార్‌ జిల్లాలో సమర శంఖారావం సభలకు హాజరవుతారు. 11వ తేదీన అనంతపురం, 13వతేదీన ప్రకాశం జిల్లాల్లో జరిగే సమావేశాల్లో జగన్‌ పాల్గొంటారు. అనంతరం మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి సమావేశాలను పార్టీ నిర్వహించనుంది. సుమారు 70 వేలకు మందికి పైగా ఈ తరహా వ్యక్తులను సమర శంఖారావం సభలలో జగన్ కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

Similar News