ఈనెల 28న విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఈనెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటిస్తారని.. విశాఖ జిల్లా పరిశీలకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

Update: 2019-12-26 07:36 GMT
వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి (ఫైల్ ఫోటో)

ఈనెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటిస్తారని.. విశాఖ జిల్లా పరిశీలకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన తరువాత మొదటిసారి సీఎం.. విశాఖకు వస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సీఎం కార్యక్రమంలో పాల్గొని కనీవినీ ఎరుగని రీతిలో సీఎంకు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. అలాగే విశాఖలో ఒక ప్లాటు తప్ప తనకు ఎటువంటి ఆస్తులు లేవని స్పష్టం చేశారాయన. వివాదాస్పద భూములను తానేదో సెటిల్మెంటు చేస్తున్నట్టు టీడీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవం అన్నారు.

విశాఖలో తనకు ఎక్కడ భూములు ఉన్నాయో దమ్ముంటే నిరూపించాలని టీడీపీకి సవాల్ విసిరారు విజయసాయి. ఇక నవరత్నాల అమలే తమ లక్ష్యమని చెప్పారాయన. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పై తీవ్ర విమర్శలు చేశారు.. ఆయన చంద్రబాబు కోవర్ట్ అని బీజేపీ వాళ్లకు ముందే తెలుసు. ఆయనతో పాటు మరో ముగ్గుర్ని పంపించాడనీ బీజేపీ వాళ్లకు అర్థమైందని అన్నారు. ఢిల్లీలో సుజనా చౌదరి ఎవరెవరిని కలుస్తాడు, ఎవరిని కాపాడటం కోసం పనిచేస్తున్నాడనేది త్వరలోనే బయట పడుతుంది. వ్యవస్థలను మ్యానేజ్ చేయడం ఎల్లవేళలా సాధ్యం కాదు. అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News