జగన్ సర్కారు సంచలన నిర్ణయం.. కరోనాపై ఏపీలో అత్యవసర ఆదేశాలు..

Update: 2020-03-30 08:48 GMT
cm ys jagan (File Photo)

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక చర్యలు చేపట్టింది. కరోనా వ్యాధి నుంచి ఏపీ ప్రజలను కాపాడేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నందున రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను తన ఆధీనంలోకి తీసుకుంటోంది. వైద్య విభాగాలు మొత్తం ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పరిధిలోకి ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని సేవలు కూడా రానున్నాయి.

రోగ నిర్ధారణ పరీక్షలు, ఇన్‌పేషంట్‌ సేవలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. అన్ని వైద్య సంస్థలను కరోనా చికిత్సకు వినియోగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటిలేటర్స్‌, ల్యాబ్స్‌, వైద్యులు, నాన్‌ మెడికల్‌ సిబ్బంది సేవలు ప్రభుత్వం పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. వైద్యులు, నర్సులు, మెడికల్, నాన్ మెడికల్ స్టాఫ్‌ను అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల అధికారులు జిల్లా కలెక్టర్ లేదా, నియమితులైన ప్రత్యేక అధికారి ఆదేశాలను పాటించాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికిప్పుడే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

Tags:    

Similar News