నేను విన్నాను.. నేను ఉన్నాను : వైయస్ జగన్

Update: 2019-03-17 09:12 GMT

వైసీపీ అధినేత వైయస్ జగన్ నర్శీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల తొలి ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో పలు సమస్యలు నా దృష్టికి వచ్చాయి.. వాటన్నినీటిని 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అంటూ భరోసా ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు వైసీపీ అధికారంలోకి వస్తే ఫుల్ పేమెంట్ వచ్చే విధంగా చేస్తామన్నారు. అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు రద్దు చేస్తామని.. ఆడపచులను లక్షాధికారులను చేసే విధంగా ప్రణాళికలు తయారు చేస్తామని చెప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో అవినీతి పెరిగిపోయింది.. వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు.

అలాగే శాంతిభద్రతలకు ముఖ్య ప్రాధాన్యతను ఇస్తామని జగన్ చెప్పారు. 2 వేలు 3 వేల రూపాయలకు ఓటర్లు మోసపోవద్దని అన్నారు. వైయస్ఆర్ చేయూత ద్వారా 45 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కఆడపడుచుకి 75 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు చంద్రబాబుకు టైం ఇస్తే అందరిని దారుణంగా మోసం చేశారని చెప్పారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని.. రైతులకు రైతుభరోసా కింద ప్రతి సంవత్సరం రూ.12500 ఇస్తామని అన్నారు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు పెన్షన్ 3 వేల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పారు. ఒక్కసారి జగన్ కూడా అవకాశం ఇవ్వాలని జగన్ ప్రజలను కోరారు. ఇక నర్సీపట్నం నియోజకవర్గనుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ ను, అలాగే అనకాపల్లి పార్లమెంటుకు సత్యవతిని గెలిపించాలని జగన్ కోరారు. 

Similar News