పాలనపై దూకుడు పెంచనున్న వైసీపీ ..

100 రోజుల పాలనలో ఏం పనులు చేశాం, ఏ ఏ హామీలు నెరవేర్చాం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సూచించారు.

Update: 2019-09-08 01:18 GMT

మౌనంగా ఉన్నామంటే అది అసమర్దత కాదు .... అవకాశం కోశం ఏదురు చూడటం . ఈ సామెత ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్ కు కరెక్ట్ గా సరిపోతుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఇక నుంచి మౌనంగా ఉండకుండా, తిప్పికొట్టనున్నారు. వంద రోజుల పాలనపై టిడిపి చేస్తున్న ఆరోపణలపై పార్టీ నేతలతో ఘాటుగా విమర్శలు చేయిస్తూ నోరు మూయిస్తున్నారు. ఇక టీడీపీ నేతలు మాట తూలారో వైసీపీ నేతల పంచ్ పడినట్లే.

మొన్నటితో వందరోజులపాలన పూర్తిచేసుకున్న వైసిపి ప్రభుత్వం ... ఇక పాలనపై దూకుడు పెంచనుంది. మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న చందాన పాలన వేగం పెంచాలని మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. టీడీపీ విమర్శలను బలంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు కోరారు.

100 రోజుల పాలనలో ఏం పనులు చేశాం, ఏ ఏ హామీలు నెరవేర్చాం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సూచించారు. ఆశావర్కర్ల జీతాలపెంపు, అమ్మఒడి, రైతుభరోసా తదితర పథకాలపై విస్త్రత ప్రచారం చేయాలని కోరారు. మరోవైపు వైసీపీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని వైసీపీ ఆదినేత ఆదేశించారు.

రాజధాని అంశం , పోలవరం రివర్స్ టెండరింగ్ అంశాలు టిడిపి విమర్శలకు అవకాశం కల్పిస్తోంది. రాజధాని మంత్రి బొత్స అరిగిపోయిన రికార్డులా రోజూ ఇదే అంశం మాట్లాడుతుండడం టీడీపీకి కలిసొస్తుంది. ఈ అంశంపై సీరియస్ అయిన  సీఎం జగన్ మంత్రులతో పాటు పార్టీ సీనియర్ నేతలకు క్లాస్ పీకినట్లు తెలిసింది. దీంతో టీడీపీ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్లు , పంచ్ లు ఇచ్చేస్తున్నారు...

పాలన పరమైన అంశాలను ప్రజలకు చేరువచేసి , ప్రజలకు ఎప్పుడు అందుబాటులో పార్టీ నాయకులు ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి వైసిపి కార్యచరణ రూపోందించింది. టీడీపీ ఏ చిన్న అవినీతి ఆరోపణ చేసిన బలంగా తిప్పికొట్టనుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ లో అమరావతిని చూపించి వేలకోట్లు అవినీతికి టీడీపీ ప్రభుత్వం పాల్పడిందని విమర్శల జోరు పెంచనుంది. 

Tags:    

Similar News