అధికారులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే హెచ్చరికలు

Update: 2019-06-16 11:28 GMT

మంగళగిరి మండల పరిషత్ సమావేశంలో అధికారుల తీరుపై స్ధానిక శాసననసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గడచిన ఐదేళ్ల లెక్క వేరని ఇకపై వేరంటూ అధికారులను హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న అధికారులు కనీసం సహకరించలేదన్న ఆయన తన విషయంలో కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదన్నారు. గతంలోనే ఒత్తిడి తెచ్చే వీలున్నా అధికారులు మానసికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చేయలేదన్నారు. ఇకపై జరిగే మండల పరిషత్ సమావేశాలకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో రావాలంటూ ఆదేశించారు. తప్పుడు సమాచారం ఇస్తే నమ్మెంత పిచ్చి వాడిని కాదంటూ అధికారులను హెచ్చరించారు. ప్రజా ధనాన్ని లూటీ చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న ఆర్కే ప్రజలు తమ పనులు జరిగేందుకు లంచాలు ఇవ్వాలని చూసిన తీసుకోవద్దన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఏ ఒక్క చర్య తీసుకున్నా సహించలేది లేదన్నారు. ఈ సమయంలో అధికారులకు ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానన్నారు.  

Tags:    

Similar News