రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరాపై సీఎం జగన్ ఆరా

Update: 2019-06-18 01:25 GMT

విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,663 విద్యుత్ ఫీడర్ల ద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహావసరాలకు విద్యుత్ వినియోగం అవుతుందని, వీటికి 3,854 ఫీడర్లకు పగటిపూట 9గంటలు కరెంట్ సరఫరా చేసే సమర్థ్యం ఉందని తెలిపారు. త్వరలో రైతులకు పగటిపూట ఉచితంగా 9 గంటల విద్యుత్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారం రోజుల్లో ఉచిత విద్యుత్‌ అందేలా నిర్ధిష్టమైన ప్రణాళికను తయారుచేయాలని ఆదేశించారు. ఉచిత విద్యుత్‌కు 60 శాతం ఫీడర్లు సిద్ధంగా ఉన్నాయని మరో 40 శాతం ఫీడర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. రైతలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన రూ1,700 కోట్లను వెంటనే కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News