ఆ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థి ఎవరు?

Update: 2019-01-03 04:12 GMT

2019 ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పదేపదే చెప్తున్న జనసేనాని తొలి అభ్యర్థిని ప్రకటించి ఒక అడుగు ముందుకు వేశారు. ఎన్నికల నాటికి భారీగా వలసలు ఉంటాయని భావిస్తున్న ఆ పార్టీ.. కలిసి వచ్చే నాయకులను వీలైనంత త్వరగా ఇంచార్జ్ లుగా నియమించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాపై దృష్టిసారించిన జనసేనాని.. ఆ జిల్లాలో పశ్చిమ ప్రకాశానికి చెందిన గిద్దలూరు నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడ్డారు. గిద్దలూరులో జనసేన ప్రభావం బలంగానే ఉంది.

ఇక్కడ యాదవ, రెడ్డి, కాపు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. టీడీపీనుంచి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పోటీలో ఉంటారని ఆ పార్టీ సంకేతాలు ఇస్తోంది. మరోవైపు వైసీపీ కూడా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఇంచార్జ్ గా నియమించింది. దాదాపుగా ఆయనకే టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇక జనసేన నుంచి పోటీకి ఉవ్విళూరుతున్నారు ప్రముఖ పారిశ్రామిక వేత్త చంద్రశేఖర్ యాదవ్. ఇప్పటికే ఆ పార్టీలో యాక్టీవ్ అయ్యారు. నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఆర్ధికంగా, సామాజికంగా బలంగా ఉన్న చంద్రశేఖర్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు.

గిద్దలూరు టికెట్ చంద్రశేఖర్ కే ఇవ్వాలని జిల్లా నేతలు పవన్ ను కోరుతున్నారు.ఇదిలావుంటే వైసీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి కూడా జనసేన టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీలో టికెట్ దక్కే అవకాశం ఆమెకు తక్కువగా ఉంది. ఆ పార్టీ ఆల్రెడీ ముగ్గురు ఇంచార్జ్ లతో ఓవర్ లోడ్ అయింది. ఇటీవల వైసీపీలో చేరిన అన్నా రాంబాబు కే టికెట్ ఇస్తునట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాంతో బలమైన క్యాడర్ కలిగిన సాయికల్పనారెడ్డి జనసేన వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి సాయికల్పనారెడ్డి పేరును కూడా జనసేనాని పరిశీలిస్తారో లేదో చూడాలి.

Similar News