సైరా నరసింహారెడ్డి చిత్రంలో వడ్డె ఓబన్న పాత్ర ఎక్కడ?

సైరా సినిమాని మరో వివాదం చుట్టుముడుతోంది. య్యాల వాడ నరసింహారెడ్డి ప్రధాన అనుచరుడు, ఉయ్యాలవాడ సైన్యాధ్యక్షుడు వడ్డె ఓబన్న పాత్ర లేకుండా సినిమా తీయడం బాధాకరమంటూ వడ్డెరలు చెబుతున్నారు.

Update: 2019-09-24 05:12 GMT

గోరంట్ల: సైరా నరసింహారెడ్డి చిత్రంలో వడ్డె ఓబన్న పాత్ర కనిపించకుండా చేసి వడ్డెర్ల మనోభావాలను దెబ్బ తీశారని వడ్డెర్ల జాతీయ సైన్యం అధ్యక్షులు అంజనేయులు ఆరోపించారు. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఉయ్యాల వాడ నరసింహారెడ్డి ప్రధాన అనుచరుడు, ఉయ్యాలవాడ సైన్యాధ్యక్షుడు వడ్డె ఓబన్న పాత్ర లేకుండా సినిమా తీయడం బాధాకరమన్నారు. వడ్డెర్ల జాతీయ ముద్దుబిడ్డ స్వాతంత్ర సమర యోధుడు వడ్డె ఓబన్న కు ఘన చరిత్ర ఉందన్నారు. ఇలాంటి వ్యక్తిని చిత్రంలో చూపించకుండా ఆయన స్థానంలో రాజపండి అని పేరు మార్చడం వడ్డెర్లను చిన్నచూపు ధోరణి లో చూపిస్తున్నట్లుగా భావిస్తున్నామన్నారు. తక్షణం ఆయనకు చిత్రంలో గుర్తింపు ఇవ్వాలని లేనిపక్షంలో విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News