Navy Day: నేడు విశాఖలో నేవీ డే.. ఆర్కే బీచ్ లో ప్రదర్శనలు

Navy Day: పాక్‌పై విజయానాకి ప్రతీకగా ఏటా నౌకాదళ దినోత్సవం

Update: 2023-12-10 06:03 GMT

Navy Day: నేడు విశాఖలో నేవీ డే.. ఆర్కే బీచ్ లో ప్రదర్శనలు

Navy Day: భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 న నేవీ డే జరుపుకుంటారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఏడాది మైచాంగ్ తుపాను కారణంగా 4వ తేదీన జరగాల్సిన వేడుక ఈరోజుకు వాయిదా పడింది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాల నుంచి ఆర్కే బీచ్‌లో ప్రదర్శనలు ప్రారంభమవుతాయి.

నేవీ యుద్ధనౌకలు, ఫైటర్ జెట్‌లు, జలాంతర్గాములు, హెలికాప్టర్‌లతో సిబ్బంది విన్యాసాలు చేస్తారు. దాదాపు 2 వేల మంది నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొంటారు. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ ఏడాది నేవీ డేకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ఒంటిగంటకు పోర్టు గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు నేవీ వ్యాయామాలకు హాజరవుతారు.

Tags:    

Similar News