పదకొండు జిల్లాల్లో గ్రామ వాలంటీర్ పోస్టుల ఖాళీలు ఇవే!

Update: 2019-06-23 11:16 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న వాలంటీర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందించడం, సమస్యల గుర్తింపు, సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఈ వాలంటీర్ల నియమాక ప్రక్రియ చేపడుతున్నారు. వాలంటీర్ల నియామకానికి సంబంధించి జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 11 జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంకా జారీ చేయలేదు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 21,600 పోస్టులు ఉండగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 9,322 పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లాల వారీగా పోస్టుల వివరాలు.. 

శ్రీకాకుళం -11,924, విజయనగరం -10,012, విశాఖపట్నం -12,272, తూర్పుగోదావరి - 21,600, పశ్చిమగోదావరి - 17,881, కృష్ణా - 14,000, గుంటూరు -17,550, అనంతపురం -14,007, చిత్తూరు -15,824, కర్నూలు - 12,045, కడప - 9,322 

Tags:    

Similar News