షాకింగ్ రిపోర్ట్.. భవిష్యత్తులో బెజవాడలో భారీ మార్పులు.. మరో గలాఫీ
ఏపీలో ప్రస్తుతం అందరి దృష్టిని బెజవాడ ఆకర్షిస్తుంది. అయితే సమీప భవిష్యత్తులో విజయవాడ భరించలేని విధంగా ఉంటుందని ఓ అధ్యయనం చెబుతోంది.
ఏపీలో ప్రస్తుతం అందరి దృష్టిని బెజవాడ ఆకర్షిస్తుంది. అయితే సమీప భవిష్యత్తులో విజయవాడ భరించలేని విధంగా ఉంటుందని ఓ అధ్యయనం చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం వాతావరణం లో మార్పులు విజయవాడపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వచ్చే 50 ఏళ్లలో 35 డిగ్రీల వేడి ఉండే రోజులు ఇక నుంచి 95 నుంచి 214 రోజులకు పెరగనున్నాయి. ప్రస్తుతం ఏడాదిలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత 95 రోజులు మాత్రమే ఉంటోంది.
అయితే వచ్చే 50 ఏళ్లలో విజయవాడలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఊహించలేనంత మార్పులు రాబోతున్నాయని నేషనల్ జియోగ్రాఫిక్ (NG) మెగా సిటీల్లో 2070 నాటికి రాబోయే వాతావరణ మార్పులపై చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం విజయవాడ ఎరిడ్, హాట్ స్టెప్పీ జోన్‌గా ఉంది. భవిష్యత్తులో ట్రాపికల్ సవన్నా జోన్ (ఎండలు ఎక్కువగా)గా మారనుంది. అంటే ఏడాదిలో ఎక్కువ కాలం ఎండలే ఉంటాయి. ఫలితంగా వర్షాలు పడే రోజుల్లో కూడా మార్పులు రానున్నాయని ఆ నివేదిక చెబుతోంది.
విజయవాడలో ప్రతీ నెలలో సగటు ఉష్ణోగ్రత 18 డిగ్రీల దాకా ఉంటుందని, వేడిగా, ఉక్కపోతతో ఉంటుందనీ ఆ రిపోర్ట్ చెబుతోంది. దక్షిణ, ఉత్తర ధృవాలకు దగ్గరగా ఉన్న నగరాల్లో సీజన్లు మారతాయిగానీ, అయితే విజయవాడలో సీజన్లు మారిన ఫీలింగ్ కలగదని రిపోర్ట్ అంటోంది. ఎప్పుడూ ఎండలు వుంటాయని ట్రాపికల్ సవన్నా ప్రాంతాల్లో ఎండాకాలం తక్కువగా, వేడి ఎక్కువగా, తడిగా ఉంటుంది. వానలు కూడా ఎండాకాలంలోనే కురుస్తాయి.
విజయవాడ భవిష్యత్తులో ఎలా ఉంటుందో ప్రస్తుతం తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీలో వున్న గలాఫీ (Galafi) నగరంలాగే ఉంది. విజయవాడ ఎలా ఉండబోతుందో దాన్ని పరిశీలిస్తే అర్థమవుతుందని ఆ రిపోర్ట్ చెబుతోంది. విజయవాడలో కొంచెం ఎం డలు పెరిగితే దాని ప్రభావం అక్కడి నీటి లభ్యత, వ్యవసాయం, మౌలిక వసతులపై తీవ్రంగా ఉంటుందని NG అంచనా చెబుతోంది. తీవ్ర ఎండల కారణంగా వాటిని తట్టుకునేందుకువిజయవాడ ప్రజల్లో శారీరక మార్పులు కూడా సంభవిస్తాయని చెబుతోంది.